బడుగు, బలహీనవర్గాలకు బలం, బలగం వైయ‌స్‌ జగన్

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

బీసీల గురించి మాట్లాడే హక్కు అచ్చెన్నాయుడికి ఉందా?

టీడీపీ హయాంలో బీసీలు మోసపోయారు

కులగణనకు టీడీపీ ఎందుకు అడ్డుపడుతోంది

సాధికార యాత్ర విజయవంతం కావడంతో టీడీపీ వెన్నులో వణుకు

బీసీలకు సీఎం వైయస్‌ జగన్‌ బ్యాక్‌ బోన్‌

విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్‌ యాత్ర విజయవంతం కావడంతో టీడీపీ వెన్నులో వణుకుపుట్టిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణి అన్నారు. రాష్ట్రంలో సాధికార బస్‌ యాత్ర విజయవంతంగా సాగుతోందని తెలిపారు. సాధికార యాత్ర విజయవంతం కావడంతో టీడీపీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. బస్‌ యాత్ర..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జైత్రయాత్రగా చెప్పాలన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. బీసీల గురించి మాట్లాడే హక్కు అచ్చెన్నాయుడికి ఉందా అని నిలదీశారు. టీడీపీ బీసీ మంత్రులు జయం జయం చంద్రన్న అంటూ భజన చేశారని ఎద్దేవా చేశారు. బీసీలను చంద్రబాబు బెదిరించినప్పుడు అచ్చెన్నాయుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. బీసీ జడ్జీలు వద్దని అప్పట్లో చంద్రబాబు లేఖ రాసినప్పుడు ఏం చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో బీసీలు మోసపోయారని గుర్తు చేశారు. టీడీపీకి రాష్ట్రంలో 175 స్థానాల్లో అభ్యర్థులు లేక బీజేపీ, జనసేన, మిగిలిన పార్టీల కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. బీసీల అభివృద్ధికి కులగణన అవసరం అంటే టీడీపీ ఎందుకు అడ్డుకుంటుందని వరుదు కళ్యాణి నిలదీశారు. రాజ్యాంగ సూచనకు మించి ఏపీలో బీసీలకు మేలు జరిగిందని చెప్పారు. బీసీలకు సీఎం వైయస్‌ జగన్‌ బ్యాక్‌ బోన్‌గా నిలిచారని ఆమె కొనియాడారు.

ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..

బీసీలను చంద్రబాబు అవమానించినప్పుడు నోరెత్తని అచ్చెన్నాయుడు, ఆ పార్టీ బీసీ నాయకులు.. ఎన్నికలొస్తున్నాయని రౌండ్ టేబుల్ సమావేశాలు అంటూ..  బీసీలపై ప్రేమ ఒలకబోస్తుంటే.. బీసీలంతా నవ్వుకుంటున్నారు. జయమ జయము చంద్రన్న అంటూ.. భజన చేసింది టీడీపీ బీసీ నాయకులు కాదా అని అచ్చెన్నాయుడును, ఆ పార్టీ బీసీ నాయకులను ప్రశ్నిస్తున్నాను.  భజనల పార్టీ టీడీపీ, భజనలు చేయించుకునే నాయకుడు చంద్రబాబు. చంద్రబాబు అధికారంలో ఉండి, అహంకారపూరితంగా బీసీల తోకలు కత్తిరిస్తానని బెదిరించి, అవమానిస్తే, ఇదే అచ్చెన్నాయుడు, ఆ పార్టీ బీసీ నాయకులు ఎందుకు ప్రశ్నించలేకపోయారు. అంటే బీసీల తోకలు కత్తిరిస్తానన్నా.. బీసీలను అవమానించినట్టు మీకు అనిపించలేదా..? విశాఖ వచ్చి, మత్స్యకారుల తోలు తీస్తానని,  అంతు చూస్తానని చంద్రబాబు అంటే టీడీపీలోని ఏ ఒక్క బీసీ నాయకుడు ఎందుకు ప్రశ్నించలేదు. ఎవరు దద్దమ్మలు అచ్చెన్నాయుడు? మీరు కాదా? మీ పదవుల కోసం చంద్రబాబు కాలు కింద చెప్పులా ఉన్నారనే విషయం మర్చిపోవద్దు. చంద్రబాబు తన ఐదేళ్ళ పాలనలో రాజ్యసభకు ఒక్క బీసీని కూడా పంపలేదు. మరి, బీసీ ప్రతినిధులు అని చెప్పుకునే మీరు ఏం చేశారు? ఎందుకు రాజ్యసభకు ఒక్క బీసీని కూడా నామినేట్ చేయలేదని ఎందుకు ప్రశ్నించలేదు. మరి ఎవరు దద్దమ్మలు? బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లెటర్ రాస్తే ఎందుకు ప్రశ్నించలేదు? బీసీ కుటుంబాల్లో ఉన్న యువతకు ఉద్యోగాలిస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు? 

రూ.87,612 కోట్ల రైతు రుణమాఫి చేస్తానని, రూ.14,200కోట్ల డ్వాక్రా రుణమాఫి చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే 50శాతానికి పైగా ఉన్న బీసీలు మోసపోతే ఎందుకు ఏ ఒక్క టీడీపీ బీసీ నాయకుడు ప్రశ్నించలేదు?. బీసీలకు చంద్రబాబు అంత ద్రోహం చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు నిలదీయలేదు. బీసీల తరఫున నిలబడని దద్దమ్మలు, చెంచాగాళ్ళు, భజనపరులు ఎవరు అచ్చెన్నాయుడు?. జగనన్న సీఎం అయ్యాక మంత్రివర్గంలో 67శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు స్థానం కల్పించారు. అందులో 11 మంది బీసీలకు మంత్రిపదవులు ఇచ్చారు. అంతేకాదు ఎనిమిది రాజ్యసభ స్థానాల్లో నాలుగు రాజ్యసభ స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు హయాంలో 11మంది బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదని ప్రశ్నించలేని దద్దమ్మలు, చవటలు ఎవరు అచ్చెన్నాయుడు?. బీసీలకు ఇచ్చిన పదవులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావుఅని అచ్చెన్నాయుడు అంటున్నారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన మీరు, మీ సహచర మంత్రులు బీసీలను ఏం  ఉద్దరించారు? ఎంతమంది నాలుకలు గీశారు అచ్చెన్నాయుడు.?. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పక్షపాత ప్రభుత్వం వైయ‌స్‌ జగన్ ప్రభుత్వం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి బీసీలకు చేసింది చెప్పడానికి సామాజిక సాధికార యాత్రతో ప్రజల్లోకి వెళ్లడం జరుగుతోంది. మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏనాడు తన పార్టీలోని ప్రజాప్రతినిధులతో ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేదు? అంటే, ఈ వర్గాలకు చంద్రబాబు చేసింది శూన్యం కాబట్టే ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. వెంటిలేటర్ పై టీడీపీ ఉందని, గతంలో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడే చెప్పాడు. మీ పార్టీ ఒంటి కన్నుతో నడుస్తోంది అనే విషయం ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలి. 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టలేని పరిస్థితుల్లో టీడీపీ ఉంది. మీకు సత్తా లేక, మీ పార్టీ ప్రచారం కోసం పవన్ కల్యాణ్, బీజేపీ, కమ్యునిస్టుల కాళ్ళు పట్టుకుని ముందుకు నడుస్తున్నారు. మేము దమ్ము, ధైర్యంగా 175 స్థానాల్లో గెలుస్తామని చెప్తున్నాం.. ప్రజల మద్దతుతో ముందుకు నడుస్తున్నాం. మీకు 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టే సామర్ధ్యం ఉందా?

కులగణనపై అక్కసు ఎందుకు?
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను బట్టి ఆయన చాలా ఫ్రస్టేషన్ లో ఉన్నారు అనే విషయం అర్ధమవుతోంది. బీసీ కులగణనను కూడా వ్యతిరేకిస్తున్నారు. బీసీ కులగణన అనేది వందేళ్ల క్రితం జరిగింది. కులగణన కోసం బీసీలందరూ కలలుగన్నారు, కులగణన కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన జరుగుతుంటే హర్షించాల్సిందిపోయి, స్వాగతించాల్సిందిపోయి ఓట్లు తీసేస్తారు, పథకాలు కట్ చేస్తారు అని అవాకులు, చవాకులు పేలుతూ అచ్చెన్నాయుడు పచ్చి అబద్దాలు చెబుతున్నారు ఇటువంటి వ్యాఖ్యలు పచ్చమీడియా ముందు మాట్లాడారు కాబట్టి సరిపోయింది. అదే పక్కరాష్ట్రాల్లో మాట్లాడితే మీ అజ్ఞానాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటారు. మీ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను, బీసీలను అవమానించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే బీసీ కులగణన అనేది దేశవ్యాప్తంగా ఉన్న బీసీల తాలుకా డిమాండ్.. పార్లమెంట్ లో ప్రతి బీసీ ఎంపీ కూడా కోరుకుంటున్నారు. బీహార్ లో కులగణన జరగడం కూడా చూశాం. బీసీ కులగణన వైయ‌స్‌ జగన్ చేపడుతున్నారని అక్కసు వెళ్లగక్కడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో బీసీ ద్రోహులు అచ్చెన్నాయుడు, చంద్రబాబు. బీసీల ద్రోహి పార్టీ టీడీపీ. బీసీ కార్మికుల ఆరోగ్యం కోసం, వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ మందుల కుంభకోణంలో డబ్బులు కాజేసి, జేబులో వేసుకున్న వ్యక్తి అచ్చెన్నాయుడు. బీసీలకు పనిముట్లు ఇచ్చే ఆదరణ పథకంలో కూడా ఆమ్యామ్యాలు తినేసిన వ్యక్తి  అచ్చెన్నాయుడు. అటువంటి మీకు బీసీల మీద ప్రేమ, అభిమానం ఉందని అంటే ఎవరూ నమ్మరు. మీరు కానీ, మీ తోక పార్టీలు కానీ చౌకబారు విమర్శలు చేస్తూ, ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

బీసీల కోసం రూ.1.12 లక్షల కోట్లు ఖర్చు చేసిన సీఎం వైయ‌స్‌ జగన్
వైయ‌స్‌ జగన్ సీఎం అయ్యాక బీసీల సంక్షేమం కోసం రూ.ఒక లక్షా 13వేల కోట్లు ఖర్చుపెడితే.. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో కేవలం రూ.30వేల కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. రాష్ట్రంలో బీసీల పక్షపాతి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతోంది. రాజ్యాంగం ఇచ్చిన పదవుల కంటే, అంతకంటే ఎక్కువ పదవులు జగనన్న బీసీలకు ఇవ్వడం జరిగింది. పథకాలు, పాలసీల్లో, పదవుల్లో బీసీలకు అగ్రతాంబులం ఎవరైనా వేశారు అంటే అది ఒక్క వైయ‌స్ జగన్  మాత్రమే. రాష్ట్రంలో గతంలో 16 మంది సీఎంలు పనిచేశారు, దేశంలో ఎంతోమంది సీఎంలుగా పరిపాలిస్తున్నారు.. ఎవరూ చెయ్యని మేలును బీసీలకు వైయ‌స్‌ జగన్ చేసి చూపించారు. బీసీ డిక్లరేషన్ సభలో బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్  కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పడమే కాకుండా సీఎం అయ్యాక బీసీలకు బ్యాక్ బోన్ గా నిలిచారు. వైయ‌స్‌ జగన్ సీఎం అయ్యాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం రూ.2లక్షల40వేల కోట్లను అత్యంత పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా, శాచురేషన్ పద్దతిలో ఇచ్చారు. అందులో 76శాతం లబ్దిదారులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. అందులోనూ 50శాతంపైగా లబ్దిదారులు బీసీలే.

పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీ వాయిస్...
గతంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు చట్టసభల్లో మన సమస్యలను ఎవరు వినిపిస్తారని బేలగా చూసే పరిస్థితి గతంలో ఉండేది.. కానీ నేడు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీ వాయిస్ వినిపిస్తుంది. దానికి కారణం వైయ‌స్‌ జగన్ అనే విషయం ప్రతి ఒక్కరు సగర్వంగా, ధైర్యంగా చెబుతున్నారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూస్తే.. జగనన్న బాద్ షాలుగా చూస్తున్నారు. చంద్రబాబు బీసీల తోలు తీస్తానని అవమానిస్తే.. జగనన్న బీసీలు తలెత్తుకుని బతికే పరిస్థితి కల్పించారు. చంద్రబాబు బీసీల తోలు తీస్తానంటే.. వైయ‌స్ జగన్‌ బీసీల్లో అంతులేని ఆత్మవిశ్వాసం నింపారు. 40ఏళ్ళ ఇండస్ట్రీ, 14ఏళ్ళ సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏనాడు బీసీలకు మేలు చేయలేదు.. కానీ జగనన్న కేవలం నాలుగున్నరేళ్లలో గొప్ప మేలు చేశారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీ, నా బీసీలు అనాలంటే ఎంత గొప్ప మనసు ఉండాలి.. అంత గొప్ప మనసున్న మన సీఎం వైయ‌స్‌ జగన్. జగనన్న పాలన... సోషల్ ఇంజినీరింగ్ కు సైంటిఫిక్ ఫార్ములా, సోషల్ జస్టిస్ కు స్పెల్లింగ్, సోషల్ రిఫార్మ్స్ కు అబ్రివేషన్.  అంత చక్కటి పరిపాలన జగనన్న అందిస్తున్నారు. శాసనసభ స్పీకర్ గా ఒక బీసీని, మండలి ఛైర్మన్ గా ఒక ఎస్సీని, డిప్యూటీ ఛైర్మన్ గా ఒక మైనార్టీని నియమించారు బీసీ పక్షపాత సీఎం వైయ‌స్‌ జగన్. వైయ‌స్ జగన్ సీఎం అయ్యాక 43 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడితే అందులో 29 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారు.. చంద్రబాబు హాయాంలో 48 ఎమ్మెల్సీలు ఇస్తే అందులో కేవలం 18 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వడం జరిగింది, ఒక్క రాజ్యసభ స్థానం కూడా చంద్రబాబు బీసీలకు ఇవ్వలేదు. చంద్రబాబు, వైయ‌స్‌ జగన్ పాలనకు తేడా తెలిసి కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్లో వైయ‌స్ జగన్ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక  ప్రతిపక్షపార్టీల నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. 

పదవులే కాదు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30లక్షల శాశ్వత ఉద్యోగాలు జగనన్న కల్పించారు. అందులో 83శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకే ఇచ్చారు. చంద్రబాబు 14ఏళ్ల పాలనలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా? అలాగే వలంటీర్ వ్యవస్థ ద్వారా 2.30లక్షల ఉద్యోగాలు ఇచ్చారు.. అందులో 80శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలవారే. 100ఏళ్ళుగా జరగని కులగణను బీసీల కోసం జగనన్న చేపట్టారు, బీసీలకు శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టమే చేశారు.139 బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్ లు ఏర్పాటుచేశారు. బీసీల అభ్యున్నతి కోసం చేయూత, ఆసరా, అమ్మఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, చేదోడు, నాడు-నేడు లాంటి ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద వర్గాల కుటుంబాలు సొంత ఇంట్లో ఉండాలని 32లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో మెజార్టీ బీసీలకే ఇవ్వడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద వర్గాల వారికోసం 22లక్షల ఇళ్లు కట్టిస్తుంటే.. అందులో మెజార్టీ బీసీలకు కట్టిస్తున్నారు. జగనన్న సీఎం అయ్యాక బీసీలకు చేస్తున్న మేలును చూసి ప్రజలంతా బీఫోర్ జగనన్న పాలన, ఆఫ్టర్ జగనన్న పాలనను బేరీజు వేసుకుంటున్నారు. జగనన్న పాలన చూసి రాష్ట్రంలో బడుగు, బలహీన, పేద వర్గాల ప్రజలందరూ జగనన్నకు మద్దతుగా నిలబడ్డారు. ప్రతి గడపను తాకిన జగనన్న పథకాలు మీద ప్రమాణం చేసి చెప్పండి.. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతివ్వం.. జగనన్నకు మద్దతిస్తామని నినదించాలి, అండగా నిలిచిన జగనన్నకు మద్దతివ్వాలి. గతంలో ఏ ముఖ్యమంత్రి అందివ్వని సంక్షేమాన్ని, అభివృద్ధిని వెనుకబడిన వర్గాలకు జగనన్న అందిస్తున్నారు.. బలహీన వర్గాల బలం జగనన్న.. బలహీనవర్గాల బలగం జగనన్న. ఈ ప్రభుత్వం గిరిజనుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దళితుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం. బీసీల ద్రోహి చంద్రబాబు, దళితుల పాలిట దయ్యం, గిరిజనుల పాలిత సైతాన్ చంద్రబాబు. విపక్షాలు ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలి, అబద్దాలు ప్రచారం చేస్తున్న మీరు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి.

తాజా వీడియోలు

Back to Top