శాసనమండలిలో ప్రజల గొంతుకగా వైయస్ఆర్‌సీపీ పోరాటం 

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశాం

చట్టసభల సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పిన సీఎం చంద్రబాబు

అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడ్డ ప్రభుత్వం

చట్టసభల్లో కూటమి ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌ కుమార్ ధ్వజం

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌ కుమార్

రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారంటు సీఎం చంద్రబాబు ఆత్మవంచన

యూరియా కొరత, గిట్టుబాటు ధరలపై నీళ్ళు నమిలిన మంత్రులు

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ప్రభుత్వాన్ని నిలదీశాం

మంత్రి లోకేష్ 'పీకుడు'భాష, ఎమ్మెల్యే బాలకృష్ణ 'తాగుబోతు' మాటలు

శాసనమండలి చైర్మన్‌కే ప్రోటోకాల్ అవమానం

చట్టసభల ఔచిత్యాన్ని మంటగలుపుతున్న కూటమి సర్కార్

మండిపడ్డ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్

తాడేపల్లి: శాసనమండలి సమావేశాల ద్వారా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాగళాన్ని వినిపించామని, ప్రజాసమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని సమర్థంగా నిలదీశామని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది రోజుల శాసనసభ, మండలి సమావేశాల్లో ఏడాదిన్నర కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామని, వారి అసమర్థ పాలనపై ప్రజల్లో రగులుతున్న ఆగ్రహాన్ని ప్రతిపక్షంగా మండలిలో వ్యక్తీకరించామని పేర్కొన్నారు. రైతుల కష్టాలు, యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ, హామీల అమలో వైఫల్యం, అప్పుల కుప్పగా మారుస్తున్న వైనం తదితర అంశాలపై ప్రతిపక్షంగా మేం సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖ్యమంత్రితో సహా మంత్రుల నీళ్ళు నమిలారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఏకంగా అబద్దాలతో సభను పక్కదోవ పట్టించేందుకు విఫలయత్నం చేశారని మండిపడ్డారు. ప్రజాగొంతుకగా వైయస్ఆర్‌సీపీ చట్టసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించిందని వివరించారు. ఇంకా ఆయనేమన్నారంటే...

కూటమి ప్రభుత్వం పదేపదే అబద్దాలను చెబతూ, వాటిని నిజాలుగా నమ్మించేందుకు అసెంబ్లీ సాక్షిగా ప్రయత్నించింది. ఎనిమిది రోజులుగా శాసనమండలిలో ప్రజాసమస్యలపై ఈ ప్రభుత్వంతో ఎలా పోరాడామో ప్రజలు గమనించారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గురించి, అసమర్థ పాలన గురించి మేం శాసనమండలిలో వాయిదా తీర్మానం, షార్ట్‌ డిస్కషన్స్‌, ప్రశ్నోత్తరాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీశాం. ప్రశ్నించిన ప్రతిసారీ సమాధానం చెప్పలేక ఎదురుదాడికి తెగబడ్డారు. ప్రతిసారీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లక భజన చేయడం, డిఫ్యాక్టో సీఎంగా ఉన్న లోకేష్ వాడిని 'పీకుడు'భాష, బాలకృష్ణ 'సైకో, తాగుబోతు'వాడుగు తప్ప మరొకటి కనిపించలేదు. 

 రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారంటూ అబద్దాలు

ఈ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు నిత్యం బారులు తీరి, రోజుల తరబడి నిరీక్షిస్తున్న ఉదంతాలను రాష్ట్రప్రజలంతా చూస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కానీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ యూరియా కొరతే లేదు, యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, నానో యూరియాను ప్రత్యామ్నాయంగా వాడాలంటూ ఉపదేశాలు ఇచ్చాడు. ఇక చంద్రబాబు మాట్లాడటం చూస్తే, అబద్దాలను ఎలా అల్లాలో ఆయనను చూసి నేర్చుకోవాలి. రాష్ట్రంలో ఎంత మేర వ్యవసాయం జరుగుతోంది, ఎంత మేరకు యూరియా అవసరం అవుతుందో కనీసం పరిజ్ఞానం లేని పాలన సాగిస్తున్నారు. ఇది రైతులను ఆదుకునే ప్రభుత్వం కాదు, రైతులను ముంచే ప్రభుత్వం. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అనే రీతిలో వైయస్ జగన్ గారి గత పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. ఏ పంటకు మద్దతుధర లేకపోయినా ప్రభుత్వపరంగా ఆదుకున్న పరిస్థితి నాడు ఉంది. నేడు చంద్రబాబు పాలనలో పండించిన పంటలకు రేటు లేక, రోడ్లపైన పారబోసి వెళ్ళిపోతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్తితిని చక్కదిద్దేబదులు రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, అన్నదాత సుఖీభవ అందరికీ అందిందని, రైతుల పంటకు మంచి ధరలు లభిస్తున్నాయని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేస్తున్నామని పచ్చి అబద్దాలు చట్టసభల్లో మాట్లాడారు. అబద్దాలతో రైతులను మోసం చేశారు. మిర్చి, పత్తి, పెసలు, ఉల్లి, టమాటా ఇలా ఏ పంటకూ కనీస ధరలు లేక రైతులు కన్నీరు పెడుతున్నారు. కానీ రైతులు సంతోషంగా ఉన్నారని చెబుతున్న నీచమైన ప్రభుత్వమిది.

 సిగ్గులేకుండా మెడికల్ కాలేజీల అమ్మకంపై సమర్థన

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కావాల్సిన వారికి అమ్ముకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను సీఎం, వైద్యశాఖ మంత్రులు సమర్థించుకుంటున్నారు. విద్యా, వైద్యాలను ప్రభుత్వరంగంలో అందించాల్సిన బాధ్యత నుంచి, ప్రైవేటీకరించేందుకు తెగబడిన సీఎం చంద్రబాబు సిగ్గులేకుండా తాము ప్రజల మేలు కోసమే ఇది చేస్తున్నామని పచ్చి అబద్దాలు మాట్లాడారు. వైయస్ జగన్ గారు చరిత్రలో మొట్టమొదటి సారిగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను తీసుకువచ్చి, ఈ రాష్ట్రంలో విద్యా, వైద్యంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఏకంగా అయిదు మెడికల్ కాలేజీలను ఆయనే సీఎంగా ప్రారంభించి, తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. మరో కాలేజీ కూడా గత ఏడాది నిర్మాణం పూర్తయ్యి, తరగతులు ప్రారంభమయ్యాయి. మిగిలిన కాలేజీలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, నాబార్డ్, కేంద్ర ప్రత్యేక ఆర్థిక చేయూతలను టైఅప్ చేశారు. వాటిని పూర్తి చేయడం చేతకాని ఈ ప్రభుత్వం, ప్రైవేటుకు అమ్ముకునేందుకు తెగబడింది. పైగా పీపీపీ అంటే తమ తాబేదార్లకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మేసుకోవడం కాదని, ఎంతో ముందుచూపుతో ప్రైవేటువారికి కట్టబెడుతున్నామంటూ సిగ్గులేకుండా సమర్థించుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రెండుశాతం అంటే రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ పూర్తయ్యేవి. ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన కూటమి ప్రభుత్వానికి అందులో కొంతైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేటాయించాలనే ఆలోచనే రాలేదు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాలకు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తామని కేంద్రం ప్రకటిస్తే, ఒక్క కాలేజీని అయినా తీసుకురావాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు. వైయస్ జగన్ చేస్తే దానిని కూడా నిర్వీర్యం చేస్తున్నాడు. విద్యా, వైద్యాన్ని ఎలా అమ్ముకోవాలని, దాని నుంచి ఎలా జేబులు నింపుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యం. కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేయడమే ఆయన పని. ఇదే విషయాన్ని ప్రజల్లోకి వచ్చి ప్రైవేటీకరణ మంచిదని చెబితే చంద్రబాబును ప్రజలు చెప్పులతో కొడతారు. దీనిని చట్టసభల్లో మేం నిలదీస్తే అర్థం లేకుండా సమర్థించుకునే యత్నం చేశారు.

 సూపర్ సిక్స్‌ అమలు చేసేశామంటూ వంచన

సూపర్ సిక్స్ గురించి శాసనమండలిలో ఆరుగురు మంత్రులు మాట్లాడారు. వారికి ఈ సూపర్ సిక్స్, సూపర్ ఫ్లాప్ అని తెలుసు. అయినా ప్రభుత్వాన్ని సమర్థించుకునేందుకు సిగ్గుపడుతూనే మాట్లాడారు. కనీసం వారిచ్చిన ఆరు హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వమింది. ఇప్పటికే ప్రజలు సూపర్ సిక్స్‌ అమలుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అమలు చేయని పథకాలను కూడా చేసేశామని చెప్పుకోవడానికి తమకే ఇబ్బందిగా ఉందని లాబీల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే వాపోయారు. 

 అప్పులపై అబద్దాలు... లిఖితపూర్వక సమాధానంతో దొరికిపోయారు

అప్పుల గురించి ఆర్థికశాఖ మంత్రి చట్టసభల్లో మాట్లాడుతూ గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అయిదేళ్ళకాంలో చేసిన అప్పులు రూ. 3.70 లక్షల కోట్లు అని లిఖిత పూర్వకంగా సమధానం ఇచ్చారు. సభ బయట మాత్రం కూటమి నేతలు గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ సిగ్గులేకుండా అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్, పయ్యావులు కూడా ఇలాగే అబద్దాలు చెబుతున్నారు. చివరికి గవర్నర్ ప్రసంగంలో కూడా రూ.10 లక్షల కోట్లు అంటూ చెప్పించారు. కూటమి పెద్దలు చెబుతున్న అప్పుల లెక్కలపైనే వారికే ఒక అవగాహన లేదు. నిత్యం గాలి మాటలు మాట్లాడుతున్నారు. అప్పులపై శాసనమండలిలో మేం నిలదీస్తే, శాసనసభలో మేం ఇచ్చిన సమాధానంను, మండలిలో చర్చించకూడదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట మార్చే ప్రయత్నం చేశారు. జీఎస్టీ 2.0 వచ్చిన తరువాత రూ.8 వేల కోట్ల మేర రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది, ఈ మొత్తాన్ని భర్తీ చేసే విధంగా కేంద్రాన్ని కోరాలని మేం సూచిస్తే, దానికీ కూటమి ప్రభుత్వం స్పందించలేదు. కానీ పక్కన ఉన్న తెలంగాణ, కర్ణాటక సీఎంలు దీనిపై కేంద్రాన్ని అడిగారు, వీరు మాత్రం అడగలేమంటూ తప్పించుకున్నారు. 

స్టీల్‌ప్లాంట్ పరిరక్షణపై చిత్తశుద్ది లేదు

స్టీల్‌ప్లాంట్ పై శాసనమండలిలో ఒక తీర్మాన్ని పెడుతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మీ తీర్మానంతో పాటు మేం ప్రతిపాదించే తీర్మానంను కూడా పెట్టాలని వైయస్ఆర్‌సీపీగా కోరాం. రెండింటినీ కలిపి ఒకే తీర్మానంగా చేసి, ఆమోదించుకుందామని అడిగాం. ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకం, స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రభుత్వపరిధిలోనే ఉండాలి, కేపిటల్ మైన్స్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిధిలో ఉండాలి, డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో క్లారిటీ ఉండాలని సూచించాం. కానీ వాటిని తీర్మానంలో పెట్టేందుకు వారు సుముఖత వ్యక్తం చేయలేదు. నిజంగా స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే, మేం ప్రతిపాదించిన అంశాలను ఎందుకు అంగీకరించలేదు? 

నీచమైన బాషతో సభ గౌరవాన్ని దిగజార్చారు

వైయస్ఆర్‌సీపీ ప్రజాపక్షంగా శానమండలిలో తన గళాన్ని వినిపించింది. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, సమాధానం చెప్పలేకు పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. చట్టసభల ఔచిత్యాన్ని దిగజార్చేలా కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు తప్పతాగి సభలో వైయస జగన్‌ గారిపై నోరు పారేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఒక రాష్ట్ర మాజీ సీఎంను ఏమాత్రం గౌరవం లేకుండా, సభ్యతా, సంస్కారాలు లేని మాటలతో ఒక తాగుబోతు ఎమ్మెల్యే నోటికి వచ్చినట్లు మాట్లాడారు. సినీనటుడు చిరంజీవి గురించి నిండుసభలో 'వాడు-వీడు' అంటూ కించపరిచేలా నోరుపారేసుకున్నాడు. ఇదేనా సభను నడిపించే తీరు. ఇక శాసనమండలిలో సాక్షాత్తు మండలి చైర్మన్‌కే ప్రోటోకాల్ విషయంలో గౌరవించకుండా అవమానించారు. శిలాఫలకాల మీద ఆయన పేరు లేకుండా కించపరిచారు. శాసనమండలి సభ్యుల సమావేశాలకు కూడా ఆయనకు కనీసం ఆహ్వానించలేదు. కేవలం ఒక దళిత నేత మండలి కౌన్సిల్ చైర్మన్‌ గా ఉండటాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి అవమానాలు చేశారు. ఎన్ని అవాంతరాలు కల్పించినా వైయస్ఆర్‌సీపీ ప్రజల పక్షాన పోరాడింది. పరిశ్రమల గురించి ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానాలు ఇవ్వడం, సకలశాఖ మంత్రిగా తనను తాను చాటుకునేందుకు ప్రయత్నించారు.

Back to Top