నెల్లూరు : అన్యాయానికి గురైన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యూఆర్ కోడ్‌తో కలిగిన డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అధికార మదంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, వీరి అండ చూసుకుని పక్షపాతంతో వ్యవహరిస్తున్న అధికారుల భరతం పట్టేందుకే డిజిటల్ బుక్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. నెల్లూరు నగరంలోని 9వ డివిజన్‌లో పార్టీ ముఖ్య నేతలతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టిన, పెట్టే వారిపై ఫిర్యాదు చేసేందుకు డిజిటల్ బుక్ ఒక అస్త్రమన్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారిపై కార్యకర్తలు, ఈ బుక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చునన్నారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు ఫిర్యాదు చేసిన వారిపై తప్పకుండా శిక్ష పడేలా చర్యలు ఉంటాయన్నారు 9వ డివిజన్ ఇన్‌చార్జ్‌గా ధనుజా రెడ్డి నెల్లూరు 9వ డివిజన్ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌గా ధనుజారెడ్డి, కో ఆర్డినేటర్ గా వాసిఫ్ ను పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. సీనియర్ నేతగా మొదటి నుంచి పార్టీ కోసం శ్రమిస్తూ .. పార్టీ నిర్మాణం కోసం ధనుజా రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. వైయస్ జగన్ నాయకత్వాన్ని మరోసారి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు.