చంద్రబాబే అయ్య‌న్న‌తో మాట్లాడించారు..

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి
 

తాడేప‌ల్లి: అయ్యన్న పాత్రుడితో చంద్రబాబే మాట్లాడించారని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. కుల,మత ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాళ్లు, కర్రలతో జోగి రమేష్‌పై దాడి చేశారన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై దాడికి దిగారన్నారు. రౌడీ మూకలతో దౌర్జన్యాలకు దిగారని  అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 సీఎం వైయ‌స్ జగన్‌పై అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top