తాడేపల్లి: తెలుగు దేశం పారటీ చేస్తున్న తప్పుడు ప్రచారాలతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. అధికార మత్తులో టీడీపీ నీతిమాలిన నిస్సిగ్గు రాజకీయాలు చేస్తోంది. నిన్నటి వైయస్ఆర్‌సీపీ ఎంపీల సమావేశంలోని ఫొటోలతో ప్రేలాపనలు, పైశాచిక పోస్టింగులతో టీడీపీ నేతలు బరితెగించారు. మంత్రులు కూడా తమ స్థాయిని దిగజార్చుకుని పోస్టింగ్‌లతో రెచ్చిపోయారు. వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్‌పై తప్పుడు ఆరోపణలతో నీచ రాజకీయాలకు తెరతీశారు. ఎల్లో బ్యాచ్ తప్పుడు ప్రచారాన్ని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. మంచి సేవలు అందించే అవకాశాన్ని కూటమి పార్టీలకు ప్రజలు అప్పటిస్తే, అధికారం చేపట్టాక వారి ప్రవర్తన, వారు వ్యవహరిస్తున్న తీరు రోజురోజుగా దిగజారుతోంది. మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్.జగన్మోహన్‌రెడ్డిగారిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డం ఒక అలవాటుగా టీడీపీ మార్చుకుంది. నిస్సిగ్గుగా, నీతిమాలిన రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్‌గారి క్యాంపు కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా.. వారి క్యాంపు కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం. ఇందులో భాగంగానే వైయస్ జగన్‌గారి క్యాంపు కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది. వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి, ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారులను కోరడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వంవైపు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం. ఇదిలా ఉండగానే టీడీపీ మంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వైయస్ జగన్‌గారిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో అత్యంత దిగజారుడు తనాన్ని సూచిస్తున్నాయి. అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులుకూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలతో వైయస్ జగన్‌గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరని తెలియజేసుకుంటున్నాను. లేళ్ల అప్పిరెడ్డి వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ