కలల సాకారం.. 

వైఎస్సార్సీపీ విప్‌ గంగుల ప్రభాకర్‌ రెడ్డి

వైఎస్సార్‌జిల్లా:  జననేత జగన్‌ వల్ల ఆళ్లగడ్డ, బనగానపల్లి, మైదుకూరు నియోజకవర్గాల రైతుల కలలు సాకారమవుతున్నాయని వైఎస్సార్సీపీ విప్‌ గంగుల ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. రూ.2400 కోట్లతో నీటి ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేసినందుకు సీఎం జగన్‌కు ఆయన కతజ్ఞతలు తెలిపారు. సోమవారం కర్నూలు జిల్లాలో నీటిప్రాజెక్టుల శంఖుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజోలు ఆనకట్టకు రూ.1350 కోట్లు కేటాయించినందకు కతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉయ్యాలవాడ, దొర్నిపాడు, చాగలమ్రరి మండలాల్లో మరో 900 ఎకరాలు ఆయకట్టు కిందికి వస్తుందని తెలిపారు. జిల్లాలోని కేసీ కెనాల్‌ చివరి ఆయకట్టు నీరందించేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు శ్రీకారం చుట్టాలని సీఎం జగన్‌ను కోరారు. 2005లో దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి కేసీకెనాల్‌ డిస్టిబ్యూటర్లు తవ్వేందుకు నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. అవి అసంపూర్తిగా ఉండటంతో 31 వేల ఎకరాలకు నీరు అందడం లేదని ప్రభాకర్‌ రెడ్డి చెప్పారు. ఈ పెండింగ్‌ పనులన్నింటినీ వెంటనే చేపట్టి రైతులను ఆదుకోవాలన్నారు. 

 

Back to Top