నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌

సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిరహిత పాలన అందిస్తున్నారు.

ప్రజల గుండెల్లో సీఎం వైయస్‌ జగన్‌ చిరస్థాయిగా నిలిచి ఉంటారు

శ్రీకాకుళం: నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చరిత్ర ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. మూలపేట పోర్టు నిర్మాణం శంకుస్థాపన సభలో దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడారు.
ఈ రోజు స్వాతంత్య్రం అనంతరం 75 ఏళ్ల చరిత్రలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన నా దైవం వైయస్‌ జగన్‌కు నమస్కారం. ఈ రోజు టెక్కలి నియోజకవర్గంలో తన పాదాన్ని మోపి ఈ ప్రాంతాన్ని వైయస్‌ జగన్‌ పునీతం చేశారు. ప్రతి ఒక్కరిని హృదయపూర్వక నమస్కారాలు.
వైయస్‌ జగన్‌ 3468 కిలోమీటర్ల పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు విని..నవరత్నాల ద్వారా సీఎం అయ్యాక అండగా నిలిచారు. అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద ఇస్తున్న సహృదయుడు సీఎం వైయస్‌ జగన్‌. పేదవాడి ఆర్థనాదాలు తీర్చేలా ఆలోచన చేస్తున్న మానవతా వాది వైయస్‌ జగన్‌. పేదవాడి కన్నీరు తుడిచిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. చెప్పిన దాని కంటే ఎక్కువగా రూ.13,500 రైతు భరోసా ద్వారా ఇస్తున్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు చేయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2350 రకాల రోగాలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఈ పథకానికి గత ప్రభుత్వం తూట్లు పొడిచింది. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక కార్పొరేట్‌ వైద్యం అందించడమే కాకుండా ఆపరేషన్‌ అయిపోయి ఇంటికి వెళ్లి రోగికి వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా ఇస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పథకంలో ఒక ఆర్థనాదం ఉంది. ఎక్కడా కూడా అవినీతి లేదు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటికే అందిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పాలన సాగుతోంది. లంచాలు లేని రాజ్యం, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, జెండా చూడకుండా అర్హతే ప్రమాణికంగా పథకాలు ఇంటికే పంపిస్తున్న మొట్ట మొదటి నాయకుడు వైయస్‌ జగన్‌. మాకు ఓటు వేయలేదని ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు. వైయస్‌ జగన్‌లోనే యేసుక్రీస్తు, అల్లా, శ్రీరామచంద్రుడిని చూసుకుంటున్నాం. ప్రజల పాలిట వైయస్‌ జగన్‌ దేవుడు. మేం ప్రజల్లోకి వెళ్తుంటే ఘనంగా ఆహ్వానించి గొప్పగా చూస్తున్నారు. జలగం వెంగళ్‌రావు సీఎంగా ఉన్నప్పుడు, ధర్మాన మంత్రిగా ఉన్నప్పుడు రూ.1000 కోట్లు ఇచ్చారని విన్నాం. ఇవాళ రూ.4300 కోట్లు ఇచ్చి ఘనమైన చరిత్రను వైయస్‌ జగన్‌ సృష్టించారు. 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గానిన ఏలుతున్న నాయకులు ఉన్నారు. ఈ ప్రాంతంలో పెట్రో కెమికల్‌ అన్నారు. భావన పాడు పోర్టు అన్నారు. ఏమీ చేయలేదు. పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు భూమి కావాలని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. వారికి భూమి మీదు ఉన్న ధ్యాస పోర్టు మీద లేదు. జగనన్న ఈ రోజు కొత్త చరిత్ర సృష్టించారు. కేవలం 600 ఎకరాల్లో పోర్టు నిర్మాణం జరుగుతోంది. మా ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి బతుకుతున్నారు. మాకు వలస జీవితాలే తెలుసు. ఇతర ప్రాంతాలకు వెళ్లే మాకు ఇవాళ పోర్టు ఇచ్చి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. జీవనోపాధి కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మా అందరి దేవుడిగా ఉన్న మిమ్మల్ని చరిత్ర ఉన్నంత వరకు ఈ శ్రీకాకుళం గడ్డ వైయస్‌ జగన్‌ను మరువదు. మా గుండెల్లో మీరు ఉంటారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కొనియాడారు.

 

Back to Top