తాడేపల్లి: మంత్రి ఆదిమూలపు సురేష్ దళిత మంత్రి అని అంతు చూస్తానంటారా అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిమూలపు సురేష్ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ మాటలను వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు.యర్రగొండపాలెంలో చంద్రబాబు కావాలనే జనాన్ని రెచ్చగొట్టారని, టీటీడీ కార్యకర్తల ద్వారా రాళ్ల దాడి చేయించారని అన్నారు. వీడియోలు చూస్తే రాళ్లదాడి చేసిన వారు ఎవరనేది స్పష్టంగా కనిపిస్తుందని, కానీ దాన్ని తోసిపుచ్చి మాపై ఎదురుదాడి చేయటం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబు వైఖరి చూస్తుంటే సురేష్‌కు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి సురేష్ మంచి విద్యావేత్త, అలాంటి వ్యక్తిపై ఇలాంటి దాడులు చేయటం కరెక్ట్ కాదు. చంద్రబాబుకు అసలు దళితులను చూస్తే ఎందుకంత కడుపుమంట అని నిలదీశారు. దళితులకు సీఎం జగన్ ఎంతో మేలుచేస్తూ అవినీతికి తావు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రస్తుతం వారి జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. అంతమాత్రానికే దళితులపై చంద్రబాబు ద్వేషం ఏంటన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏం మాట్లాడారంటే..:
– నిన్న ఎర్రగొండపాలెంలో మంత్రి సురేశ్‌పై చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
– దళితులను అవహేళన చేస్తున్న టీడీపీ, చంద్రబాబు వైఖరి ఏమిటని, ఒక సామాన్య కార్యకర్తలా మంత్రి ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది.
– రాజకీయ పార్టీగా ఒక వర్గం వారి హక్కులు కాపాడడం, వారిపై అవమానాలను ఖండిస్తూ.. ఇతర పార్టీల వైఖరిని అడిగే బాధ్యత, స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. అందులో భాగంగానే నిన్న మంత్రి సురేశ్.. పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు.
– అది తప్పు కాదు కదా? మరి, టీడీపీ అతి జోక్యం ఎందుకు?
– ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు, మంత్రి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. ‘మంత్రి ఆదిమూలపు సురేశ్ అంతు చూస్తాం’.. అని బెదిరించడం ఎంతవరకు సమజసం? ఇదేనా చంద్రబాబు రాజకీయం?
– అందుకే మంత్రి సురేశ్‌కు ప్రత్యేక భద్రత కల్పించడంతో పాటు, నిన్న టీడీపీ రాళ్లదాడిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
దళితుల్లో చైతన్యం పెరిగి నిలదీస్తే తప్పా?:
– సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు దళితులపై అంతగా ఇరిటేట్ అవ్వడంలో అర్ధమేంటì.? దళితులు బాగు పడితే ఆయన ఎందుకు చూడలేరు?
– ఆనాటి అంబేద్కర్ ఆలోచన, ఆశయాలకు అనుగుణంగా దళితులకు మా ప్రభుత్వం అండగా ఉన్నందునే.. ఈరోజు వారంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. సీఎంగారిపై విశేష ఆదరణ చూపుతున్నారు.
– గ్రామాల్లో ఐక్యంగా ఉన్న దళితులు, తమ హక్కుల విషయంలో మీ వైఖరి ఏమిటని చంద్రబాబును అడగడం తప్పా?
– అందుకు ఏకంగా మా పార్టీ కార్యకర్తలు, పార్టీ ఆఫీస్‌పై రాళ్ల దాడి చేయించడమే కాకుండా, ‘ఒక దళిత మంత్రిని పట్టుకుని అంతు చూస్తాం’ అని బెదిరించడం అత్యంత దారుణం.
– మంత్రి సురేశ్‌కు చంద్రబాబు నుంచి అపకారం జరగొచ్చని ఆందోళన చెందుతున్నాం. అందుకే మంత్రికి ప్రత్యేక భద్రత కల్పించి.. నిన్నటి చంద్రబాబు వ్యవహారశైలిపై విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం.
మొండితోక అరుణ్‌కుమార్ ఏం మాట్లాడారంటే..:
బాబు డైవర్షన్ పాలిటిక్స్:
– టైమ్స్‌నౌ నవభారత్ సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో 24 నుంచి 25 ఎంపీ స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుందని వెల్లడించగానే చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టింది.
– ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో మేం విస్తృతంగా పర్యటిస్తూ గడప గడపకు తిరుగుతున్నామని.. వైఎస్‌ఆర్‌సీపీకి రోజురోజుకి జనాదరణ పెరుగుతుందని తట్టుకోలేకనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
– అందులో భాగంగానే ఎర్రగొండపాలెం ఇష్యూను తెరమీదికి తెచ్చి టైమ్స్ నౌ సర్వే విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
– తరుచూ దళితులను అవహేళన చేస్తున్న చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ వెంటనే వారికి క్షమాపణ చెప్పాలి.
దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా..:
– టీడీపీ రాళ్లదాడిలో దళిత సర్పంచ్ తల పగిలింది. ఇది దారుణం.
– దళితులపై దాడి చేయించడం చంద్రబాబుకు అలవాటు. దళితుల హక్కులు కాల రాయడం అయనకు కొత్త కాదు.
– గతంలో నందిగామలోనూ రాళ్ల దాడి డ్రామా చేశారు.
– అలా చేసి దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉంటుంది బాబు వ్యవహారశైలి.
పట్టాభి.. నోరు జారితే నాలుక కోస్తాం:
– లోకేశ్ యువగళం పాదయాత్ర అభాసుపాలైందనే బాధ చంద్రబాబులో కనిపిస్తో్తంది. లోకేశ్ భవిష్యత్తు అంధకారం అవుతుందనే ఆందోళన బాబులో కలిగినప్పుడల్లా ఈ పంది పట్టాభిని వైయస్‌ఆర్‌సీపీపై ఉసి గొల్పుతున్నాడు.
– ముఖ్యమంత్రిగా ఉండి కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని దద్దమ్మ చంద్రబాబు. 2019 ఎన్నికల్లో జగన్‌గారు కొట్టిన దెబ్బకు తమ పార్టీ 23 సీట్లకే పరిమితం కావడంతో, తండ్రీ కొడుకులిద్దరూ పిచ్చెక్కి ఊరూరు తిరుగుతున్నారు.
– ఈసారి వైయస్ జగన్ గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే.. నాలుక కోస్తాం అని పట్టాభిని.. మొండితోక అరుణ్‌కుమార్ హెచ్చరించారు.