తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యరులు, పార్టీ మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని, సమన్వయంతో వారిని గెలిపించాలన్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం వైయస్ జగన్ పరిచయం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎస్. సుధాకర్, తూర్పు రాయలసీమ జిల్లాల అభ్యర్ధిగా పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ జిల్లాల అభ్యర్ధిగా వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానానికి ఎం.వి. రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారని సీఎం వైయస్ జగన్ ప్రకటించి, పరిచయం చేశారు.