లక్ష కోట్ల రాజధాని వద్దు..సాగునీటి ప్రాజెక్టులే ముద్దు 

చంద్రబాబు రాయలసీమ ద్రోహి

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

అనంతపురం:. లక్ష కోట్ల రాజధాని వద్దు..సాగునీటి ప్రాజెక్టులే ముద్దని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.  ప్రతిపక్ష నేత చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఆయన విమర్శించారు.సీమ ప్రాజెక్టులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రేపు సాయంత్రం ప్రజా సంఘాలతో అనంతపురంలో సభ ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. చంద్రబాబు అమరావతి ఓ భ్రమరావతి..గ్రాఫిక్స్‌తో ఐదేళ్లు చంద్రబాబు కాలయాపన చేశారని విమర్శించారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు చంద్రబాబు ఎందుకు జోలె పట్టలేదని ప్రశ్నించారు. లక్షల మంది వలసలు వెళ్లినప్పుడు బాబు జోలె ఎందుకు పట్టలేదని నిలదీశారు.గత ఐదేళ్లలో టీడీపీ నేతలు వేల కోట్లు దోచేశారని విమర్శించారు. 13 జిల్లాల అభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదా అని ప్రశ్నించారు.

Back to Top