అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోనే సామాజిక న్యాయం సాధ్యమైందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారని చెప్పారు. ఎంతో మంది దళితులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారని వివరించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమే సామాజిక న్యాయం జరిగింది. మళ్లీ ఇప్పుడు వైయస్ జగన్ సారధ్యంలో అది సాధ్యమవుతోంది. ఏ పల్లెకు వెళ్లినా ప్రతి ఇంటిలో వైయస్ జగన్ పథకం లబ్ధిదారుడు ఉన్నారు. ఎంత మంది కుట్రలు పన్నినా..అవహేళనగా మాట్లాడినా..ఓట్లు వేసిన జనాంగం కోసం, తన తండ్రి నమ్మిన ప్రజల కోసం సీఎం వైయస్ జగన్ 80 శాతం ప్రజలకు సమాన న్యాయం జరుగుతోంది. వైయస్ జగన్ తీసుకువచ్చిన పాలనా సంస్కరణలు, సామాజిక సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. స్తీ్ర శక్తిని పెంపొదిస్తున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా పేద పిల్లలను బడిబాట పట్టిస్తున్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. వైయస్‌ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళల్లో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతోంది. పేద బిడ్డలను కాపాడుకునేందుకు ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఆహార లోపాన్ని గమనించిన సీఎం వైయస్ జగన్ సంపూర్ణ పోషణ పథకాన్ని, జగనన్న గోరు ముద్ద వంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మూడు పూటల అన్నం తినగలుగుతున్నాం. విదేశాలకు కూడా మా పిల్లలను పంపించవచ్చు అన్న ఆశ పుట్టింది. ఇంగ్లీష్ మీడియంపై ఈ సభలో కుట్ర చేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారు. న్యాయస్థానానికి వెళ్లారు. వైయస్ జగన్ సుపరిపాలనలో ఇంగ్లీష్ మీడియం అమలు అవుతుందని నమ్మకం మాకు ఉంది. ఈ రాష్ట్రంలో 648 మంది ఎంపీపీలుగా ఎన్నికైతే..మా ఎస్సీలకు 135మందికి అవకాశాలు దక్కాయి. 13 జిల్లా పరిషత్ చైర్మన్లలో ఇద్దరికి ఎస్సీలకు అవకాశం కల్పించారు. 13 కార్పొరేషన్లలో ఇద్దరు ఎస్సీలకు మేయర్ పదవులు వచ్చాయి. 75 మున్సిపల్ చైర్‌పర్సన్లు ఉంటే 11 మందికి అవకాశం కల్పించారు. ఏఎంసీ చైర్మన్లుగా 32 మందికి అవకాశం దొరికింది. 137 స్టేట్ కార్పొరేషన్లు ఉంటే అందులో 24 మందికి అవకాశం దొరికింది. 484 మంది డైరెక్టర్లలో 64 మందికి అవకాశం దొరికింది. ఐదుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దళిత మహిళ హోం మంత్రిగా ఉన్నారు. మరో మంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దళిత ఎమ్మెల్సీ కోయ మోషన్ రాజును మండలి చైర్మన్‌గా నియమించారు. ఎంపీగా నందిగాం సురేష్‌ను చేశారని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు వివరించారు.