మన పోరాటం కరోనాపైనే..రోగులపై కాదు

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

వాలంటీర్లు, ఆశా వర్కర్లుకు నిత్యావసర వస్తువులు పంపిణీ

కర్నూలు: ఈ రోజు ప్రపంచమంతా కరోనాపైనే పోరాటం చేస్తుందని, మన పోరాటం వ్యాధిపైనే కాని, రోగులపై కాదని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు. కరోనా సోకిన రోగుల పట్ల వివక్ష చూపొద్దని, వైరస్‌ కట్టడికి ముందుండి పోరాటం చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి నిత్యావసర వస్తువులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓ వైపు కరోనాను కట్టడిచేస్తూనే నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు.  కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.  ధరలను నియంత్రణలో ఉంచామన్నారు.  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నామన్నారు.  వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూస్తున్నామని చెప్పారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రజలకు చేరవేస్తున్నామన్నారు.  

నిత్యావసర వస్తువుల పంపిణీ
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సొంత నిధులతో  ఆత్మకూరు మండలంలోని గ్రామ వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు , మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బందికి  నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.  ఒక్కొక్కరికి బియ్యం - 5 కేజీ లు, కందిపప్పు  -1కేజీ, చెక్కెర - 1కేజీ, వేరుశెనగ నూనె -1ప్యాకెట్ , కిలో గోధుమ పిండి, మాస్కులు, శానిటైజర్ లను సుమారు 400 మందికి పైగా పంపిణీ చేశారు.  కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నేత శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, నాయకులు చిట్యాల వెంకట్‌రెడ్డి, అంజాద్‌బాషా, పువ్వాడి భాస్కర్‌, గౌస్‌లాజం తదితరులు పాల్గొన్నారు.

Back to Top