నిరుపేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం 

ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను

ఎన్టీఆర్ జిల్లా: నిరుపేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమలు చేశారని ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట పట్టణం,బాయ్స్ హై స్కూల్ వ‌ద్ద‌ 12,13,14వ‌ సచివాలయాలకు జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. పేద ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి మన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి  ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. అందుకనే ఆరోగ్యశ్రీలో కూడా గతంలో కంటే ఎక్కువ వ్యాధులకు చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో 17 వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కే దక్కుతుందన్నారు. జగనన్న సురక్ష ద్వారా స్పెషలిస్ట్ వైద్యులు గ్రామాలకే తరలివచ్చి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందివ్వడం జరుగుతుందన్నారు. ఐదు దశలుగా జరిగే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, హఫీజున్నిసా ఫిరోజ్ ఖాన్, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజీ, కౌన్సిలర్లు పందుల రోశయ్య, పాకలపాటి సుందరమ్మ, తన్నీరు నాగేంద్ర, పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు షేక్ మునిహేరా, విద్యావేత్త చైర్మన్ రంగాపురం నరసింహారావు, నాయకులు గింజుపల్లి కృష్ణ, జంగాల వాసు,దొంగల జనకి రమయ్య,మోరే బాబి,యేసుపోగు కృపారావు, మారేపల్లి నాగేంద్ర, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top