ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో ఎమ్మెల్యే రోజా భేటీ

పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చ‌

తాడేప‌ల్లి: వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట వేసింద‌ని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె.రోజా సెల్వమణి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ మ‌హిళా విభాగం, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా తోడ్పాటును అందిస్తుంద‌న్నారు. వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వం మ‌హిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top