సన్‌రైజ్‌ మాటున బాబు తన కుమారుడిని రైజింగ్‌ చేశారు

మహిళలు, బలహీన వర్గాలపై టీడీపీకి ప్రేమ లేదు

ఎస్సీ, ఎస్టీ బిల్లుపై కూడా అడ్డుపడటం దారుణం

ఎమ్మెల్యే రోజా

అసెంబ్లీ: చంద్రబాబు సన్‌రైజ్‌ మాటున తన కుమారుడిని రైజింగ్‌ చేశారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.  సభలో మహిళా మంత్రి మాట్లాడుతుంటే టీడీపీ గొడవ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ బిల్లుపై కూడా అడ్డుపడటం దారుణం.  మహిళలు, బలహీన వర్గాలపై టీడీపీకి ప్రేమ లేదు. నిన్న చంద్రబాబు మాట్లాడుతుంటే..రాయలసీమ గురించి చెబుతారేమో అని ఎదురుచూశాం. మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చంద్రబాబు ఎందుకు శాశ్వత కట్టడాలు చేపట్టలేదు. సన్‌రైజ్‌ మాటున చంద్రబాబు తన కుమారుడిని రైసింగ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సీఎం వైయస్‌ జగన్‌ అన్ని విధాల అండగా ఉన్నారు. తండ్రీ కొడుకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు. చంద్రబాబును కేసీఆర్‌ పొగిడారని అంటున్నారు. చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్‌ లేడని అదే కేసీఆర్‌ అన్నారు. 4 వేల ఎకరాలు దోచుకుని ఇంకా సేవ్‌ చేయంటున్నారు. ఏ ఒక్క మంచి బిల్లు వచ్చినా అడ్డుకుంటున్నారు. నిన్న సభలో చంద్రబాబు సంక్షోభాలు నాకు కొత్త కాదు..దాంట్లోనే వెతుక్కుంటానని అన్నారు. నాకు నిన్ననే అర్థం అయ్యింది. సీఎం వైయస్‌ జగన్‌, మంత్రి బుగ్గన మాట్లాడినప్పుడు అర్థమైంది. రాజధాని సంక్షోభాన్ని చంద్రబాబు అవకాశంగా మార్చుకున్నారు. చంద్రబాబు, ఆయన బినామీలు రైతుల నుంచి దోచుకున్నారు. పరిపాలన వికేంద్రీకరణ అవసరం లేదంటున్నారు. వీళ్లకు బుద్ది, జ్ఞానం ఉందా? వీకేంద్రీకరణ జరగకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. ఈ రోజు హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు ఏ విధంగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవాలి. విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరూ మూడు రాజధానులను స్వాగతిస్తున్నారు. వీళ్లు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వైయస్‌ జగన్‌ క్యాబినెట్‌లో అవకాశం ఇచ్చారు.  ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి పదవులు ఇచ్చారు. మహిళా మంత్రులు మాట్లాడుతుంటే టీడీపీ నతేలు అవమానిస్తున్నారు. అన్ని వర్గాలు బతికేదాన్ని సామాజిక రాజధాని అంటారు. సామాజిక వర్గానికి ఒక రాజధాని కావాలని వీళ్లు కోరుకుంటున్నారు. రాజధాని ప్రాంతంలో గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్తిపాటి పుల్లారావు, దూళిపాళ్ల నరేంద్ర చౌదరి, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడ భూములు కొన్నారు. ఇక్కడ నక్క ఆనంద్‌బాబు ఎందుకు భూములు కొనలేదు. అనంతపురం నుంచి పయ్యవుల కేశవ్‌  ఇక్కడ భూములు కొన్నారు. కానీ యామిని బాల ఎందుకు కొనుగోలు చేయలేదు. ఈ విషయాలు ఆలోచన చేయాలి. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పయ్యవుల కేశవ్‌ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఎందుకు ఇళ్లు కట్టుకోలేదు. అక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కుదర్లేదు కాబట్టి కట్టుకోలేదా?. రైతుల గురించి వీళ్లా మాట్లాడేది. ఈ రోజు రాజన్న రాజ్యం, రైతు రాజ్యం వచ్చింది. ఆరు నెలల్లోనే వైయస్‌ఆర్‌ భరోసా, ఉచిత విద్యుత్‌, మద్దతు ధర ఇచ్చారు వైయస్‌ జగన్‌. రైతు పక్షపాతి వైయస్‌ జగన్‌. ఎస్సీ, ఎస్టీలకు పరిహారం పెంచిన ఉదారవాది మా సీఎం వైయస్‌ జగన్‌. 

Back to Top