ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన వారే ధర్నాలు చేస్తున్నారు

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు భువనేశ్వరి బయటకు రాలేదు

చంద్రబాబు పెట్టిన హుండీలో భువనేశ్వరి, ఆయన కోడలు విరాళం ఇచ్చారా?

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

అమరావతి: రాజధాని ప్రాంతంలో భూములు కొన్న చంద్రబాబు బినామీలు, వ్యాపారులే తమ స్థలాలకు రేట్లు పడిపోతాయని ధర్నాలు చేస్తున్నారని, నిజమైన రైతులు ఎవరు కూడా పోరాటం చేయడం లేదని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు రాజధానిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తే ఎలా నమ్మాలని ప్రజలు అడుగుతున్నారని ఆమె తెలిపారు. లోకేష్‌, ఆయన భార్య న్యూ ఇయర్‌ వేడుకలు ఎక్కడ జరుపుకున్నారని ప్రశ్నించారు. ఎందుకు వారు రాజధాని రైతులకు అండగా లేరని నిలదీశారు. చంద్రబాబు తన భార్యను రాజకీయ పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. నారా భువనేశ్వరి ..తన తండ్రిపై భర్త చంద్రబాబు చెప్పులు వేయించి అవమానించినప్పుడు బయటకు రాలేదని, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు బయటకు రాలేదన్నారు. ఈ రోజు తన తండ్రి పదవిని లాక్కొన్ని, అసెంబ్లీ నుంచి తండ్రి ఏడ్చుతూ వెళ్లినా భువనేశ్వరి పరామర్శించలేదన్నారు. హరికృష్ణను పార్టీ నుంచి గెంటేసి అవమానించినా ఆమె బయటకు రాలేదు. తన సోదరి పురంధేశ్వరిని పార్టీ నుంచి వెలేసినా ఆమె బయటకు వచ్చి మాట్లాడలేదన్నారు. రాజధాని రైతుల కోసం బయటకు వచ్చి రెండు గాజులు ఇచ్చారంటే ఎలా నమ్మాలని రాజధాని రైతులు అడుగుతున్నారన్నారు. రాజధాని నిర్మాణం కోసం సచివాలయంలో హుండీలు పెట్టి స్కూల్‌ పిల్లల వద్ద చందాలు వసూలు చేస్తే.. ఆ రోజు  భువనేశ్వరి కానీ, ఆమె కోడలు కానీ ఎందుకు డబ్బులు డొనేట్‌ చేయలేదన్నారు. అమరావతిలో నిజమైన రైతులు ఎవరైనా ధర్నాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.  అమరావతిపై చంద్రబాబుకు ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ఎలా నమ్మాలని రోజా ప్రశ్నించారు. అమరావతి రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అధికార వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో రాజధానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని, ఆయనే ఈ రోజు రాజధాని కోసం ఆయన పోరాటం చేస్తున్నట్లు నటిస్తుంటే ఎలా నమ్మాలని ప్రజలు అడుగుతున్నారన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన వారే తమ భూములకు రేట్లు పడిపోయాయని ధర్నాలు చేస్తున్నారని, నిజమైన రైతులుధర్నాలు చేయడం లేదన్నారు. 

Back to Top