బీసీ కార్పొరేషన్‌ పదవులలో మహిళలకు ప్రాధాన్యత

ఎమ్మెల్యే రజనీ 
 

విజయవాడ: బీసీ కార్పొరేషన్‌ పదవులలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే విడుదల రజినీ పేర్కొన్నారు. బీసీ సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమె చెప్పారు. గురువారం విజయవాడలో నిర్వహించిన బీసీ సంక్రాంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సంక్షేమ పథకాల్లో బీసీలే అధికంగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 2 కోట్ల 83 లక్షల 57 వేల మంది బీసీలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. రూ.37.931 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు.  దేశంలోనే తొలిసారిగా ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. ఒక్కో కార్పొరేషన్‌లో 13 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. దేశంలోనే యువకుడు, ఇంత చిన్న వయసులోనే ఏపీలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీల కోసం ఇంత ముందు చూపుతో ఆలోచన చేస్తున్నారని, ఇంత బాగా జరుగుతుందని మన సీఎం వైయస్‌ జగన్‌ గురించి దేశమంతా చెప్పాలని బీసీ జాతీయ నాయకుడు ఆర్‌.కృష్ణయ్యను కోరారని చెప్పారు. ఆయన తన ప్రసంగంలో ..ఈ మధ్యకాలంలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి వెళ్తే అక్కడ వైయస్‌ జగన్‌ పదవులు, పథకాలన్నీ బీసీలకే ఇస్తున్నారని కృష్ణయ్యను అడిగారంటే..అక్కడి ప్రజలు వైయస్‌ జగన్‌ బీసీ కులాలకు చెందిన వ్యక్తా అని ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌.కృష్ణయ్యను అడిగారని చెప్పారు. అంత ప్రాధాన్యత బీసీలకు ఇక్కడ ఇస్తున్నారంటే..అందరం గమనించాలన్నారు. మహాత్మాజ్యోతిరావు పూలే మాదిరిగా ఈ రోజు కనబడని పూలే వైయస్‌ జగన్‌ అని చెప్పారని గుర్తు చేశారు. మనమంతా 139 కులాల్లో ఏ ఒక్క కులానికి చెందినా..మనమంతా బీసీలం. మనలో ఐక్యత ఉండాలి. ఎటువంటి అభిప్రాయభేదాలు రాకూడదు. ఈ రాష్ట్ర ప్రజలు వైయస్‌ జగన్‌కు మద్దతుగా ఉండాలని విడుదల రజినీ కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top