చంద్ర‌బాబు..సిగ్గుప‌డండి

సాలూరు జనాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే రాజన్నదొర 

విజ‌య‌న‌గ‌రం: 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం అని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయిస్తున్నందుకు సిగ్గు ప‌డాల‌ని ఎమ్మెల్యే రాజ‌న్న దొర అన్నారు. గురువారం సాలూరులో చేప‌ట్టిన జ‌నాగ్ర‌హ దీక్ష‌లో ఎమ్మెల్యే పాల్గొని ప్ర‌సంగించారు.  టీడీపీ పార్టీకి చెందిన పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా నాయకులు, కార్యకర్తలు మండల స్థాయిలో రెండు రోజుల పాటు నిరసనలు చేపడుతున్నారు. బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు,ఎంపీపీ  ,వైస్ ఎంపీపీ  ,ఎంపిటీసీలు, సర్పంచ్లు,పట్టణ కౌన్సిలర్లు, మండల,పట్టణ వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top