వైయ‌స్ఆర్‌సీపీ సైనికులకు పెద్ద పండగ

మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి
 

గుంటూరు:  ప్లీన‌రీ స‌మావేశాలు వైయ‌స్ఆర్‌సీపీ సైనికులకు పెద్ద పండగ అని మాజీ మంత్రి పుష్ప శ్రీ‌వాణి తెలిపారు.  ఘనమైన పోరాటాల చరిత్రవైయ‌స్ఆర్‌సీపీకి ఉందన్నారు. వైయ‌స్ఆర్  సంకల్పాన్ని సీఎం వైయ‌స్‌ జగన్‌ నిజం చేసి చూపించార‌ని చెప్పారు. వైయ‌స్ఆర్ ఆశయాలను సీఎం వైయ‌స్ జగన్‌ నెరవేర్చుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శక పాలన సాగుతోందన్నారు. పారదర్శక పాలనకు గ్రామ, వార్డు సచివాలయాలే నిదర్శమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.  

Back to Top