జిల్లా ప్రజల చిరకాల వాంఛను తీర్చిన  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  పొన్నాడ సతీష్‌

కోన‌సీమ‌:  కోనసీమ జిల్లాగా చూడాలన్న జిల్లా ప్రజల చిరకాల వాంఛను తీర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. వేట నిషేదిత సమయంలో మనం అందిస్తున్న భరోసాను చూసి సీఎం వైయ‌స్ జగన్‌ను మత్స్యకారులు వారింట్లో వ్యక్తిగా చూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను అసలు పట్టించుకోలేదన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ సహకారంతో ఓఎన్‌జీసీ నష్టపరిహారం అందుతోందన్నారు. చేతి వృత్తులవారు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందున్నారంటే కారణం​ సీఎం వైయ‌స్ జగన్‌ అని అన్నారు. రాజకీయంగా పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించి బీసీలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చినందుకు బీసీల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా వీడియోలు

Back to Top