వైయ‌స్ఆర్‌సీపీ ఒంటరిగానే పోటీ

ఎమ్మెల్యే పేర్ని నాని
 

 విజ‌య‌వాడ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంత్‌ కిశోర్‌ తమకు కన్సల్టెంట్‌ మాత్రమేనన్నారు. టీడీపీ, జనసేన లాగా వావీ వరస లేకుండా పొత్తు పెట్టుకునే సిద్ధాంతం మాది కాదన్నారు. బీజేపీని తిట్టిన టీడీపీ, జనసేన ఆ పార్టీతోనే జత కట్టాయని దుయ్యబట్టారు. బీజేపీ ద్వారా పవన్‌ రాష్ట్రానికి ఏం సాధించారు అని ప్రశ్నించారు. ‘‘ఎవరైతే మాకు ప్రత్యేక హోదా ఇస్తారో.. వారికి మద్దతు పలికే విషయాన్ని ఆలోచిస్తామని’’ పేర్ని నాని అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top