ఈ సారి ఏపీలో టీడీపీకి రెండు సీట్లు కూడా వస్తాయో లేదో తెలీదు

ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు 

నూజివీడు:  2024 ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీకి రెండు సీట్లు కూడా వ‌స్తాయో లేదో తెలీద‌ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అనుమానం వ్య‌క్తం చేశౄరు. పేదలకు భూ పంపిణీ, భూములపై సర్వహక్కులు కల్పన కార్య‌క్ర‌మాన్ని నూజివీడులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు ఏమన్నారంటే...ఆయన మాటల్లోనే

 
అందరికీ నమస్కారం, ఈ రోజు చాలా గొప్ప రోజు, సీఎంగారు గతంలో నూజివీడు వచ్చినప్పుడు హమీలు ఇచ్చారు, ఆ రోజు నేను ఈ హామీలు అమలవుతాయా లేదా అని భయపడ్డాను, కానీ అన్ని హామీలు నెరవేర్చిన ఏకైక సీఎం, ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని పథకాలు ఉన్నాయా అని అడుగుతున్నా, సీఎంగారు ఇది మెట్ట ప్రాంతం, అటవీ భూములు, పోరంబోకు భూములు ఉన్నాయి, గతంలో వైఎస్‌ఆర్‌ గారు వేలమందికి పట్టాలిచ్చారు.

ఇప్పుడు మీరు ఇస్తున్నారు, నాడు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చిన ఘనత వైయ‌స్‌ఆర్‌ది, ఇప్పుడు వైయ‌స్ జగన్‌ గారిది, చంద్రబాబు ఎప్పుడైనా పట్టా ఇచ్చారా, ఇవ్వలేదు, చంద్రబాబు నూజివీడు వచ్చిన ప్రతిసారి ట్రిపుల్‌ ఐటీలో ఒక మొక్క నాటారు తప్ప నూజివీడుకు చేసిందేం లేదు, ఆ మొక్కలు కూడా చనిపోయాయి, ఈ రోజు సీఎంగారు వేలాదిమందికి ఇళ్ళ స్ధలాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నారు, చంద్రబాబు నూజివీడుకు ఏం చేశారని అడుగుతున్నా, చంద్రబాబు రైతు భరోసా ఇచ్చారా ఎన్నడైనా, ఇవ్వలేదు, నూజివీడులో క్యాపిటల్‌ అన్నారు కానీ ఇక్కడ కాకుండా తీసుకెళ్ళిపోయారు, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అన్నారు ముగ్గులేశారు కానీ అతీగతీ లేదు.
 
నాడు వైయ‌స్‌ఆర్‌ గారు నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 40 వేల ఓట్లు వస్తే నువ్వురా అని కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకుని నన్ను ఎమ్మెల్యేను చేశారు, ఆయన మూడు సార్లు వచ్చి నూజివీడు అభివృద్దికి చాలా చేశారు, చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకున్నారు, ఈ సారి ఏపీలో టీడీపీకి రెండు సీట్లు కూడా వస్తాయో లేదో తెలీదు.

మన సీఎంగారు 175 కి 175 గెలుస్తారు, రెండోసారి సీఎంగా మన జగన్‌గారు ప్రమాణం చేస్తారు, లోకేష్‌ ఇక్కడికి వస్తే వెయ్యి మంది జనమే, ఆయన మాపై ఆరోపణలు చేశాడు, లోకేష్‌ గారు మీ పని అయిపోయింది, మీకు జనం రారు, నూజివీడులో ఈ రోజు జనమే జనం, లోకేష్‌ మీకు రాజకీయాలు వద్దు, ఏమైనా వ్యాపారాలు చేసుకోండి, మా నూజివీడులో చాలా భూములు ఉన్నాయి, మా సీఎంగారికి చెప్పి మీకు కావాల్సిన అనుమతులు ఇప్తిస్తా, మీరు రాజకీయాలకు పనికిరారు.

తెలంగాణలో టీడీపీ పరిస్ధితి ఏపీలో కూడా అంతే, చంద్రబాబు ఒక్క పథకమైనా ఇచ్చారా, జగన్‌ గారు ఇన్ని పథకాలు ఇంత అభివృద్ది చేస్తుంటే టీడీపీ నేతలు చెట్ల కింద కూర్చుని కబుర్లు చెబుతున్నారు, సింహం సింహాసనంపై కూర్చుని ఉంది, మీరు దింపగలరా, సీఎంగారు నూజివీడులో అభివృద్దికి నిధులు ఇస్తామన్నారు, ఈ ప్రాంత మామిడికి అవసరమైన మ్యాంగో పల్ప్‌ యూనిట్‌ సెకండ్‌ ఫేజ్‌కు తగిన అనుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నాను, చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా చేయాలని కోరుతున్నాను, టీడీపీకి ఓటేస్తే మనం గోదావరిలో వేసినట్లే, ధ్యాంక్యూ.

Back to Top