ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు 

ఎన్నికల కోడ్ ఎత్తివేయడం శుభపరిణామం

ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సుప్రీం సూచనలతో పేదలకు భూ పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. ఎన్నికల కోడ్‌ కారణంగా ఉగాది రోజు ఇళ్ల స్థలాల పంపిణీకి అవరోధం ఏర్పడుతుంది. సుప్రీం కోర్టు తీర్పుతో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీకి మార్గం సుగమం అయ్యింది. సుప్రీం కోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిపై చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు పేదలకు  ఇళ్ల స్థలాలు అందకుండా చేసిన కుట్రకు అడ్డంకులు తొలిగిపోయాయి. ఏం చేయాలన్నది ముఖ్యమంత్రి  ఆలోచన చేస్తారు. ప్రభుత్వ పరంగా అన్ని విషయాలు పునఃసమీక్షిస్తాం.  ప్రభుత్వం చేతిలో బదిలీలు ఉండకూడదని ఎన్నికల కోడ్‌ను కొనసాగించాలన్న కుట్ర తొలగిపోయిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు.

Back to Top