అభివృద్ధిని అడ్డుకునే సైంధవులు టీడీపీ నేతలు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

విజయవాడ: గడిచిన ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకునే సైంధవుల్లా తయారయ్యారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటపడుతుండటంతో టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. విజయవాడలో ఎమ్మెల్యే విష్ణు మీడియాతో మాట్లాడుతూ..ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ చేయమని టీడీపీ సవాళ్లు విసిరిందని, దోపిడీ బయట పెట్టేందుకు ప్రభుత్వం సిట్‌ వేస్తే కక్ష అంటున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలవి నరం లేని నాలుకలన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి భాగోతాలన్నీ రాష్ట్రపతికి ఇచ్చిన పుస్తకంలో ఎప్పుడో పొందుపరిచామన్నారు. అనుభవం పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నాడని మండిపడ్డారు.

రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారని, పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. అమరావతి ప్రాంతంలో దళిత ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి పాల్పడటం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. ఈఎస్‌ఐలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన అచ్చెన్నాయుడు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ గ్యాంగ్‌కు పచ్చ మీడియా తోడైందన్నారు. టీడీపీ అవినీతిని వెలికితీసి దోషులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

 

తాజా ఫోటోలు

Back to Top