రాళ్లపాడు ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయండి

 

శాసనసభలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మహిధర్‌రెడ్డి

అసెంబ్లీ: సోమశిల ఉత్తర కాల్వ నుంచి కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్‌రెడ్డి కోరారు. కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్టును దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని, దాదాపు పదేళ్లయినా హక్కుగా రావాల్సిన 1.5 టీఎంసీల నీరు ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మహిధర్‌రెడ్డి ఏం మాట్లాడారంటే.. ‘రాళ్లపాడు ప్రాజెక్టుకు హక్కుగా రావాల్సిన 1.5 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు ఇటీవల ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌  అంగీకరించారు. దురదృష్టం ఏమోగానీ.. ఇరిగేషన్‌ మంత్రి హామీ ఇచ్చినా.. అధికారులు నీటిని విడుదల చేయడానికి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇందుకు గల కారణాలు, ఎప్పటి లోగా నీటిని ఇస్తారో చెప్పండి. వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని ఆదుకోవాలని 1.5 టీఎంసీ నీటిని విడుదల చేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు అక్కడి రైతాంగానికి ఆరుతడి పంటలు వేసుకోవాలా.. వద్దా అని చెప్పలేకపోతున్నాం. మంత్రి సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేసి రావాల్సిన నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే మహిధర్‌రెడ్డి కోరారు.

తాజా ఫోటోలు

Back to Top