అనవసరంగా రోడ్డు ఎక్కితే ఉపేక్షించేది లేదు

  ఎమ్మెల్యే  కొట్టు సత్యనారాయణ

 
తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉందని అనవసరంగా రోడ్డు ఎక్కితే ఉపేక్షించేది లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే  కొట్టు సత్యనారాయణ  హెచ్చరించారు. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని  సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  వాహనాలను కూడా పోలీసులు సీజ్‌ చేస్తారని పేర్కొన్నారు. కరోనా సాకుతో నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రజలు ఎవరూ భయపడొద్దని.. అన్ని వేళ్లలో అందుబాటులో ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి సమస్య వచ్చినా ప్రజలు వెంటనే తెలియజేయాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుని..పరిశుభ్రత పాటించడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఈ నెల 31 వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 

Back to Top