మాట మీద నిలబడే నాయకులు సీఎం వైయస్‌ జగన్‌

కాటసాని రాంభూపాల్‌రెడ్డి
 

కర్నూలు: వైయస్‌ కుటుంబం అంటే ప్రజల్లో ఒక ప్రగాఢ నమ్మకం ఉందని, మాట మీద నిలబడే నాయకులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కర్నూలును రాజధానిగా వదులుకుంటే..మళ్లి మనకు ఒక రాజధాని ప్రసాదించిన నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి . వైయస్‌ఆర్‌ కుటుంబం మాట ఇస్తే మడమ తప్పరు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు ఒక్కటే విజ్ఞప్తి..పాణ్యం, బనగానపల్లె మండలాలకు గోరుకల్లు రిజర్వాయర్‌ ప్రసాదించారు. మీరు కల్లూరు, ఓర్వకల్లు మండలాలకు హంద్రీనీవా ద్వారా సాగునీరు అందించాలని కోరుతున్నాను. వైయస్‌ఆర్‌ ఏ విధంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారో..మీరు కూడా సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాను. పాణ్యం నియోజకవర్గంలోని 15వార్డులు కర్నూలు కార్పొరేషన్‌లో ఉన్నాయి. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కర్నూలు నగరంలో రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసి టౌన్‌లోకి వాహనాలు రాకుండా మళ్లించాలి. అడిగిన కోర్కెలు తీర్చి దివంగత మహానేత వైయస్‌ఆర్‌ మాదిరిగా ప్రజల అభిమానాలు చూరగొనాలని, ఇప్పటికే నవరత్నాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. కర్నూలుకు జ్యుడిషియల్‌ రాజధాని ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు జిల్లా ప్రజలు రుణపడి ఉంటారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అందరం అండగా ఉంటాం. ఇచ్చిన మాట నిలబెట్టిన సీఎం వైయస్‌ జగన్‌కు అందరం తోడుగా ఉందాం. చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. అదే సీఎం వైయస్‌ జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా.

తాజా వీడియోలు

Back to Top