విశాఖ: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. నిమ్మగడ్డ ఒక సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు: అనంత వెంకట్రామిరెడ్డి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ అభ్యర్థనను ఎస్‌ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను కాదని నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.