ఇంగ్లీష్‌ ఉంటే ఆనందం..లేకపోతే ఆందోళన

ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్‌ విద్య ఒక ఆస్తి

అసమానతలు తొలగాలంటే విద్య అవసరం

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

అసెంబ్లీ: ఇంగ్లీష్‌ ఉంటే ఆనందం..లేకపోతే ఆందోళన అనే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. ఎవరైనా ఇంగ్లీష్‌ మాట్లాడుతుంటే అర్థం కాని వారు తెల్లమోహాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తమ పిల్లలు ఇంగ్లీష్‌ మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఆనందపడుతారు. ఇంగ్లీష్‌మీడియం బిల్లుకు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్‌ విద్య ఒక ఆస్తి. విత్‌ అవుట్‌ ఇంగ్లీష్‌..ఇతర ప్రాంతాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చంద్రబాబు యూటర్న్‌ పేరును సార్ధకం చేసుకున్నారు. మొదట ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించారు. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఇంగ్లీష్‌ చదువులు అవసరం. అందరూ అక్షరాసులుగా ఉండాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం. అందులో భాగంగా ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేస్తున్నారు. అలాగే తెలుగు ఔన్నత్యాన్ని చాటి చెబుతూ తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశారు. టీడీపీ నేతలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వ్యవసాయ కూలీలు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంతవరకు తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివించలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయడంతో అసమానతలు తొలుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో కొడుకును ఇంగ్లీష్‌ మీడియం..కూతురును తెలుగు మీడియంలో చదివించేవారు. రేపు ఈ విధానం రూపుమాపే అవకాశం ఉంది. ఇంగ్లీష్‌ మీడియం బిల్లు విషయంలో అందరూ సమర్ధించాలి. టీడీపీ అగడాలను రాష్ట్ర ప్రజలు సహించరు. ఈ బిల్లును సమర్ధిస్తున్నానని ఎమ్మెల్యే ధర్మశ్రీ పేర్కొన్నారు.

Back to Top