కాకినాడ: ఐటీ నోటీసులపై చంద్రబాబు నోరు తెరవడం లేదంటే తప్పు ఒప్పుకున్నట్లే అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడినా ఎల్లో మీడియా ఆణిముత్యాలు ఏరుకుంటోంది. పచ్చి అబద్దాలను వండి వారుస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన జాతీయ మీడియాపై నారా లోకేశ్ ఎందుకు పరువు నష్టం దావా వేయలేదు అని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం ఆధీనంలో నడిచే సంస్థ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు ఓ గజదొంగ. అవినీతిలో పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయాడు. కోర్టులను అడ్డుపెట్టుకుని దర్యాప్తులను ఆపుకోవడం బాబుకు అలవాటే. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు ముడుపులు చేరాయి. చిన్న చిన్న ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన లోకేశ్.. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన జాతీయ మీడియాపై పరువు నష్టం దావా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కురుసాల కన్నబాబు ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు.
మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:
*రిపేర్ కాని సైకిల్ అది:*
చంద్రబాబు కాకినాడలో తమ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని జగన్ గారిని తిట్టిపోయడం, శాపనార్ధాలు పెట్టడం చేశాడు.
తమను తాము చాలా గొప్పవారిగా, నీతి వంతులుగా, గాంధీ గారిలా చిత్రీకరించుకోవడం వారికి పరిపాటి.
వారు ఏం మాట్లాడినా ఆ ఆణిముత్యాలను ఏరుకునే ఎల్లో మీడియా ఉంది కాబట్టి చిలకపలుకులన్నీ పలుకుతున్నాడు.
చంద్రబాబును, ఆయన కుమారుడిని బాహుబలి1, బాహుబలి2 లా చిత్రీకరించే మీడియా ఉంది కాబట్టి ఆయన అలవోకగా ఏదైనా మాట్లాడగలడు.
పచ్చి అబద్దాలను వండి వారుస్తాడు. దీనికి సమాధానం చెప్పవయ్యా అంటే మాత్రం దాటేస్తాడు.
నిన్న ఆయన మాట్లాడింది చూస్తే చిత్రంగా అనిపించింది. సైకిల్ అన్ స్టాపబుల్ అట.
నీ సైకిల్ పంక్చర్ అయిందా..గాలిపోయిందా అనేది 2019లోనే అందరూ చూశారు.
నీకు నువ్వు గొప్పవాడిని అనుకుంటే తప్పులేదు. ఎదుటి వారిని దొంగలుగా చూపిస్తున్న నువ్వు ఒకర్ని వేలు పెట్టి చూపితే నాలుగు వేళ్లు నీవైపు చూపుతాయి అనేది మర్చిపోయావు.
*చిన్న చిన్న కాంట్రాక్టుల్లోనే ఇంత నొక్కిన నువ్వు ఎంత పెద్ద గజదొంగవో..?:*
చంద్రబాబు తనని ఎవరూ ఏమీ పీకలేరని, తాను సచ్చీలుడనని కితాబు ఇచ్చుకుంటున్నాడు.
తాజాగా ఆయనపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆదాయపు పన్నుల శాఖ ఇచ్చిన వివరాలతో వార్తలు వచ్చాయి.
జాతీయ మీడియాలో రాసిన అంశాలను చూస్తే మీరు ఎంత దుర్మార్గమైన అవినీతి చేశారనేది బహిర్గతమైంది.
వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వ్యవస్థలను మేనేజ్ చేయగల చంద్రబాబు రూ.119 కోట్ల షోకాజ్ నోటీసుపై కూడా దాటేసే కథ నడిపిస్తున్నాడు.
హైదరాబాద్‌లోని ఇన్‌కం టాక్స్ సర్కిల్ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
రూ. 119 కోట్ల కేవలం ఒక్క ఆర్థిక సంవత్సరంలో వచ్చినవే.
షాపూర్జీ పల్లోంజీ , ఎల్ అండ్ టీ అనే కంపెనీల నుంచి వేరే షెల్ కంపెనీలకు మళ్లించి, వాటి నుంచి చంద్రబాబుకు మళ్లించారని ఐదేళ్ల పాటు విచారణ చేసి నిగ్గుతేల్చి నోటీసులు ఇచ్చారు.
ఈ రెండు కంపెనీల నుంచి డబ్బు చంద్రబాబుకు అందాయనడానికి వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్ ఆధారాలున్నాయి అని కూడా ఇన్‌కం టాక్స్ చెప్పింది.
మనోజ్ వాసుదేవ్ పార్ధసానీ అనే షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధిని విచారణ చేసినప్పుడు ఈ వ్యవహారమంతా బయటకు వచ్చింది.
ఇలాంటి చిన్న చిన్న కాంట్రాక్టుల్లోనే చంద్రబాబు అమరావతిలో ఇంత డబ్బు నొక్కేసాడంటే ఇతను ఎంత పెద్ద గజదొంగ అయి ఉంటాడు..?
ఆయన పీఎస్ శ్రీనివాస్ దాదాపు రూ.2వేల కోట్ల అవినీతి లావాదేవీలు జరిగాయని కూడా బయటపడినట్లు ఆధారాలు చెప్తున్నాయి.
*ఇంత జరిగితే నోరు విప్పవేం బాబూ..?:*
ఇంత జరిగితే ఎక్కడా చంద్రబాబు నోరువిప్పడు. ఆయన వంది మాగధులు, భజన బృందాలు మాట్లాడరు.
ఆయన ఎల్లో మీడియా అసలే మాట్లాడదు. వారంతా చంద్రబాబు అంతటి నిజాయితీపరుడు లేడని కలరింగ్ ఇచ్చుకుని బతుకుతున్నారు.
జరగని దాన్ని స్కాం కింద చూపించి ఏదో జరిగిపోతుందని రోజూ వండివార్చే చూపించే చంద్రబాబు సొంత కంపెనీలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు కూడా నోరు తెరవడం లేదు.
రూ.119 కోట్ల మేరకు చంద్రబాబుకు నేరుగా అవినీతి సొమ్ము అందింది అని సాక్షాత్తు ఐటీ శాఖ నిగ్గుతేలిస్తే నోరుమెపదపడం లేదు ఎందుకు..?
కనిపించడం లేదా..రాయాలనిపించడం లేదా..?
మీరు ఏం రాస్తే అది..ఏం చూసిస్తే అది జనం నమ్ముతారు అని మీ నమ్మకం.
పక్కా ఆధారాలతో దొరికినా సరే బుకాయించే కార్యక్రమం చేస్తునాడు.
కనీసం నిన్న కాకినాడలో పెట్టిన సభలోనైనా దాన్ని ఎందుకు ఖండించలేకపోయాడు..?
నీకు సంబంధం లేకపోతే మీడియాకు సరే..కనీసం నీ కార్యకర్తలకైనా సమాధానం చెప్పాలి కదా..?
చెప్పే దమ్ములేదంటే తప్పు జరిగిందనేది వాస్తవం. చంద్రబాబు దొరికిన దొంగ.
1999లోనే తెహల్కా చంద్రబాబు ఎలా అవినీతి సామ్రాజ్యం నిర్మాణం చేసుకున్నాడో చెప్పింది.
ఐదారేళ్ల క్రితం ఓటుకు నోటు కేసు ద్వారా కూడా ఈయన వద్ద ఎంతటి అవినీతి సొమ్ము పేరుకు పోయిందో తెలుస్తోంది.
వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు ఇలా మేనేజ్ చేసుకుంటూ పోతే ప్రజలు తనను సచ్ఛీలుడిగా అనుకుంటున్నారని భావిస్తున్నాడు.
ఈ మొత్తం కార్యక్రమంలో కేవలం చంద్రబాబు పేరే కాదు..ఆయన కుమారుడు లోకేశ్ పేరు కూడా చెప్తున్నారు.
అయినా ఎందుకు మాట్లాడటం లేదు..? కారణం ఏమిటి..?
ఈ దొంగతనాన్ని ఈ పత్రికలు, ఆయన చుట్టూ ఉన్న మందీమాగదం సమర్ధిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి. కనీసం దీన్ని నిగ్గు తేల్చండి అని ఎందుకు చెప్పరు..?
*ఆ పత్రికపై, ఐటీశాఖపై ఎందుకు పరువునష్టం దావా వేయడం లేదో..?:*
వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దర్యాప్తులను ఆపుకోవడం, స్టేలు తెచ్చుకుని తన మీద ఏమీ లేదన్నట్లు మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్లడం ఆయనకు అలవాటు.
చిన్నది జరిగితే మా మీద పరువు నష్టం దావా వేస్తారు కదా..? మీరు రూ.119 కోట్లు అవినీతి జరిగిందని ఆ పత్రిక రాస్తే ఎందుకు పరువు నష్టం దావా వేయడం లేదు..? ఐటీ శాఖపై వేయకపోయారా..?
చిన్నది జరిగితే మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పే మీరు ఇలాంటిది వస్తే పరువు నష్టం అనిపించలేదా..?
వారిపై ఎందుకు పరువు నష్టం దావా వేయడం లేదు..మీకు పరువు లేదా..?
ఆరోపణలకు పరువు నష్టం ఉండదు అనుకుంటే చిన్న చిన్న రాజకీయ ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన చరిత్ర మీ హెరిటేజ్‌కు, మీకు ఉంది కదా..?
రూ.119 కోట్ల వ్యవహారంలో తేలు కుట్టిన దొంగల్లాగా ఉండిపోతున్నారని దీనికి అర్ధం.
కేంద్రంలోనూ మీకు పలుకుబడి ఉంది..మొన్ననే వెళ్లి నడ్డాగారి చెవులు కొరికి వచ్చారు.
మీ సొంత వదిన గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిని చేసుకున్నారు.
తప్పు జరగకపోతే మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు.
మసిపూసి మారేడు కాయ చేసే వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నడపగలుగుతున్నారు.
*పవన్, బీజేపీ, కమ్యూనిస్టులు ఎందుకు ప్రశ్నించడం లేదు..?:*
ఇక పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి ప్రశ్నిస్తారని మనం అనుకోలేం.
ఆయన మొదటి నుంచి చంద్రబాబుతో జట్టుకట్టి వెళ్తున్నాడు కాబట్టి ఆయన మాట్లాడలేడు.
చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు రూ.119 కోట్లు లంచం తీసుకున్నాడని తేలినా ఒక రాజకీయ పార్టీగా అడగలేకపోతున్నాడు.
పవన్ కల్యాణ్ మాట్లాడడు...ఆ బీజేపీ కూడా మాట్లాడదు ..ఎందుకంటే అక్కడ సొంత వదిన గారే అధ్యక్షురాలు కాబట్టి. కమ్యూనిస్టులు ఇక ఎలాగూ మాట్లాడరు.
అమరావతి అనేది లంచాల కోసం నిర్మాణం చేస్తామన్న ఒక మహానగరమే తప్ప మరొకటి కాదు.
అది అమరావతి కాదు..లంచాలవతి..అవినీతివతి.
అందుకే అలా కదిపితే చాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.
లేని స్కాంను ఉన్నట్లు చూపించే చంద్రబాబు మీడియాకు ఇది ఎందుకు కనిపించడం లేదనేదే ప్రశ్న.
*నీకే గ్యారెంటీ లేదు...ఇక నువ్వేం గ్యారెంటీ ఇస్తావు బాబూ..?:*
సత్యహరిశ్ఛంద్రుడికి మనవుడిలా చంద్రబాబు మాట్లాడుతుంటాడు.
బాబు గారి గ్యారెంటీ అనే కొత్త పథకం తీసుకొచ్చాడు..
ఆయన సంతకం పెట్టి ష్యూరిటీ ఇస్తారట..బూత్ కమిటీ మెంబర్‌తో కూడా సంతకాలు పెట్టించి ఇంటింటికీ కాగితాలు ఇస్తారట.
దానికి సూపర్ సిక్సర్ అని కూడా పేరు పెట్టాడు.
ఈయనకు మతిమరుపు ఉండి...అందరికీ మతిమరుపు ఉందనుకుంటాడు.
ఇప్పుడు ఆయన గ్యారెంటీ ఇస్తాడా..? దానికి సంతకాలు పెట్టిస్తాడా..?
2014లో 650 అంశాలతో ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కులేదు.
అందులో 10శాతం కూడా మీరు అమలు చేయలేకపోయారు.
దాన్ని ఆన్‌లైన్ నుంచి తీసి మడతెట్టి లోపల దాచుకున్న ఘన చరిత్ర మీది.
నీ గ్యారెంటీలు, హామీలు ఈ రాష్ట్రం చాలా చూసింది చంద్రబాబూ..
చెప్పిందానికే దిక్కులేదు..సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా అంటాడు.
నీ హాయంలో ఆర్టీసీని ఎలా నాశనం చేశాడో మనందరం చూశాం.
జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి నిలబెట్టగలిగారు.
అప్పట్లో చంద్రబాబు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే దివాళా తీస్తుంది..ఆర్టీసీని అమ్మేయడానికి చూస్తున్నాడు అన్నాడు.
ఆర్టీసీ బస్సులను గ్రామాలకు తిరగకుండా దివాళా తీయించిన ఘనత చంద్రబాబుది.
కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టి..ఇక్కడ హామీలిస్తున్నాడు.
*చంద్రబాబు చరిత్రలో గ్యారెంటీగా అమలు చేసిన ఒక పథకమైనా ఉందా..?:*
ఇన్ని చెప్తున్నావు కదా..వ్యవసాయ రుణమాఫీ రూ.87,612 కోట్లు అని చెప్పి రూ.15 వేల కోట్లు చేశావ్...
ఇవ్వాల్సిన టైంలో డబ్బు ఇవ్వకుండా పసుపు పచ్చని బాండ్స్‌పై సంతకం చేసి ఇచ్చాడు..అవి నాలుక గీసుకోడానికి కూడా పనికిరాలేదు.
మళ్లీ ఇప్పుడొచ్చి గ్యారెంటీ, ష్యూరిటీ అంటున్నాడు.
చంద్రబాబు తన చరిత్రలో గ్యారెంటీగా అమలు చేసిన ఒక పథకం ఏదైనా ఉందా..?
డ్వాక్రా రుణమాఫీ రూ.14,205 కోట్లు చేస్తానని చెప్పి చేసిందేo లేదు..చివర్లో పసుపుకుంకుమ అంటూ హడావుడి చేసి బొక్కాబొర్లా పడ్డది మనం చూశాం.
ఆయన హయాంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 38వేలు. జగన్ గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 2.06 లక్షలు.
చంద్రబాబు నువ్వు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మూడు సంతకాలే మోసం కదా చంద్రబాబు.
ఒక్క సంతకమైనా అమలు చేశాడా..? ఇప్పుడు ఇచ్చే హామీలు వంచన హామీలు. నయవంచన కార్డులు ఇస్తున్నాడు.
చంద్రబాబు బ్రాండే విశ్వసనీయత లేకపోవడం, వెన్నుపోటు పొడవడం.
ఇప్పుడు మేకతోలు కప్పుకుని వస్తే జనం నమ్మరు బాబూ.
*సూపర్ సిక్స్ కాదు..బౌండరీలో క్యాచ్ ఇచ్చి వెళ్లిపోతాడు:*
గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి లాస్ట్ బాల్ అన్నట్లు...ఈయన లాస్ట్ బాల్‌లా సూపర్ సిక్స్ అంటున్నాడు . ఆయనకు.. ఈయనకు
తర్వాత రాజకీయ భవిష్యత్తు ఎలాగూ లేదు. పార్టీ ఉంటుందో లేదో తెలియదు. ఉన్నా ఈయన రాజకీయం చేయగలుగుతాడో లేదో తెలియదు.
ఇన్ని గందరగోళాల మధ్య లాస్ట్ బాల్ అంటూ సూపర్ సిక్స్ అంటున్నాడు. కచ్చితంగా బౌండరీలో క్యాచ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
ఒక పక్క ఆయనకే గ్యారెంటీ లేదు..నేను గ్యారెంటీ ఇస్తానంటూ తిరుగుతున్నాడు.
నిజంగా గ్యారెంటీ ఇచ్చే శక్తే ఉంటే ఇన్ని పొత్తులు ఎందుకు..? బీజేపీ వద్ద కాళ్లా వేళ్లా పడటంఎందుకు..పవన్‌ను సంకనెత్తుకుని తిరగడం ఎందుకు..?
నిజంగా చంద్రబాబుకి తాను అధికారంలోకి వస్తాననే గ్యారెంటీ ఉంటే ఎవర్నన్నా దగ్గరికి చేరనిస్తాడా..?
ప్రజలు అనుకుంటే అన్‌స్టాపబుల్ కాదు..ప్రజలు అనుకుంటే హోల్డ్ ఆన్ అంటారు.
ఇప్పుడు సైకిల్ చైన్, హ్యాండిల్ ఎక్కుడుందో అర్ధం కావడం లేదు.
సాయంత్రానికి దోమల్ని జగన్ గారు మీ ఇంటికి తోలుతున్నాడట..ఖర్మరా బాబు..!
నువ్వే ఈ రాష్ట్రానికి పట్టిన దోమకాటు...ఇంత దిగజారిపోయిన తర్వాత అతని గురించి మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు.
దమ్ముగా నిర్మాణాత్మక విమర్శలు చేయలేని ఈయన ఎంత సేపు జగన్ గారిపై వేదన, రోదన.
ఎన్టీఆర్ పెట్టిన మద్యనిషేదాన్ని ఎత్తివేసిన ఈ చంద్రబాబు ఇప్పుడొచ్చి మద్యనిషేదం గురించి మాట్లాడుతున్నాడు.
మద్య నియంత్రణ మా విధానం అని జగన్ గారు స్పష్టంగా చెప్పారు.
తాగుబోతులపై చాలా సానుభూతి, ప్రేమ చూపిస్తున్నాడు.
ఎవరైనా కడుపుకు రెండు పూట్లా అన్నం తినలేకపోతున్నారని బాధపడతారు..ఈయన తాగుబోతులు రెండు పూటలా తాగలేకపోతున్నారని బాధపడిపోతున్నాడు.
*అసలు మిమ్మల్ని ఎవడు రానిస్తాడు మీరేదన్నా చేయడానికి..?:*
ఐటీ శాఖ రూ.119 కోట్లకు ఇచ్చిన నోటీసుల సంగతి ఏంటి..?
చాలా క్లియర్‌గా ఆధారాలతో సహా ఐటీ శాఖ నోటీసులిచ్చింది.
నీ మీద విమర్శలు వచ్చినప్పుడు రోడ్డు మీదకు వచ్చి జగన్ గారిని దారుణమైన భాషలో విమర్శిస్తే మొత్తం డైవర్ట్ అవుతుందని ఆయన భావన.
మాట్లాడితే మేం వస్తున్నాం..వీడి సంగతి..వాడి సంగతి తేలుస్తాం అంటున్నారు. ఏం పీకుతారు..?
అసలు మిమ్మల్ని ఎవడు రానిస్తాడు..ప్రజలైతే అందుకు సిద్ధంగా లేరు.
మీరు ఎన్ని జట్లు కట్టి వచ్చినా జనం మాత్రం జగన్ గారివైపే ఉన్నారు.
లోకేశ్ పాదయాత్రకు, చంద్రబాబు స్పీచ్‌లకు ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటే మరోసారి బొక్క బోర్లా పడతారు.
మొన్నటి వరకూ ఈ డబ్బులు ఎక్కడినుంచి తెస్తాడు..ఎలా ఎకౌంట్లలో వేస్తాడు అన్నాడు.
ఇప్పుడు వచ్చి జగన్ గారి కంటే రెండు రెట్లు అధికంగా వేస్తాను అంటున్నాడు.
పెళ్లికి వచ్చి రెండు మీటింగులు పెట్టుకుని వెళ్లిపోవడం కాదు. ఈ నోటీసులకు సమాధానం చెప్పు.
నీ అవినీతి కోసం ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నావు..మూడు రాజధానులు అనగానే విలవిలలాడిపోయావ్.
కోర్టులను మేనేజ్ చేసి, వ్యవస్థలను మేనేజ్ చేసి యాత్రలంటూ ఉద్యమంలా క్రియేట్ చేసి హడావుడి చేశాడు.
అసలైన ఉద్యమం చేయండ్రా అంటూ హైకోర్టు చెప్తే మర్నాటికి ఎవడూ లేడు.
జగన్ గారిని ఆడిపోసుకోవడం కాదు..తిన్న వాడెవడు..దోచుకున్నవాడెవడు అనేది ప్రజలకు తెలుసు.
ఒక ఎంపీటీసీ, ఒక పంచాయతీ, ఒక వార్డు మెంబర్ గెలిస్తేనే పండుగ చేసుకుంటూ గెలిచాం చూశారా అంటూ చెప్పుకుంటున్నాడు.