కర్నూలు : చెరుకులపాడులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్నందుకే వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు, తన భర్త నారాయణరెడ్డిని, ఆయన అనుచరుడు సాంబశివుడిని పట్టపగలు శ్యాంబాబు హత్య చేయించారని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పేర్కొన్నారు. ఈ విషయం నారాలోకేష్ తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆమె హెచ్చరించారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమార్కులను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేతలే దాడి చేసిన విషయం లోకేష్ మరవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల నదులు నిండి ఇసుక సమస్య తలెత్తిందన్నారు. వర్షాలు తగ్గగానే ఇసుక కొరత ఉండదన్నారు. Read Also: ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి ..ఇదే సీఎం వైయస్ జగన్ పాలన