మరణం లేని మహానేత రాజన్న

ఎమ్మెల్యే  జొన్నలగడ్డ పద్మావతి  
 

అనంత‌పురం:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మరణం లేని మహానేత అని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కొనియాడారు. గార్లదిన్నె మండల కేంద్రంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా మ‌హానేత‌ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎందరికో జీవితాన్నిచ్చిన మహానుభావుడు వైయ‌స్ రాజశేఖరరెడ్డిగారు అని గుర్తు చేశారు. 
ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో పునర్జన్మని ఇచ్చారని తెలిపారు. పేదవాడి గుండెల్లో ఆయనకెప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. మరణించినా ఇంకా జనంలో జీవించి ఉన్న నేతలు చాలా అరుదుగా ఉంటారని, వారిలో ఒకరు వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి  అని ఆయన చేసిన సేవలను స్మ‌రించుకున్నారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top