సీఎం వైయస్‌ జగన్‌ అభినవ పూలే

బలహీనవర్గాలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి మా నాయకుడు

బీసీల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు

59.85 శాతం రిజర్వేషన్‌ను అడ్డుకున్న చంద్రబాబు చరిత్రహీనుడు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

 

తాడేపల్లి: బలహీనవర్గాలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాత్రమేనని, వైయస్‌ జగన్‌ అభినవ పూలే అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. బీసీల మేలు కోసం సీఎం వైయస్‌ జగన్‌ చేసే ప్రతీ కార్యక్రమాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నాడని, 59.85 శాతం రిజర్వేషన్‌తో ముందుకు వెళ్తుంటే కోర్టులో కేసు వేయించి ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నాడని మండిపడ్డారు.  బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..
 
‘హైకోర్టులో నిన్న తీర్పు వచ్చిన తరువాత చంద్రబాబు తాబేదారులు వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులం అని చెప్పుకునే యనమల, అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌ తెగ రెచ్చిపోయి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వారిని సూటిగా అడుగుతున్నా.. బీసీలకు ఎక్కువగా రిజర్వేషన్‌ ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తే.. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ ప్రచారం 50 శాతం రిజర్వేషన్‌ కంటే మించకూడదని హైకోర్టు చెప్పిందన్నారు. అసలు సుప్రీం కోర్టుకు వెళ్లిన వ్యక్తి ఎవరూ..? బిర్రు ప్రతాప్‌ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు హయాంలో ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్‌.. ఈ పదవి ఇచ్చింది చంద్రబాబే. తనకు పదవి ఇచ్చి సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, సహకరించిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని బిర్రు ప్రతాప్‌రెడ్డి గతంలో ప్రకటన ఇచ్చాడు.

బలహీనవర్గాలను మోసం చేయాలని సుప్రీం కోర్టు వరకు బిర్రు ప్రతాప్‌రెడ్డిని చంద్రబాబు వాడుకున్నాడు. బలహీన వర్గాలు అంటే చంద్రబాబుకు ఎంత చిన్న చూపో అర్థం చేసుకోండి. రెడ్డి అనే తోక ఉంది.. వైయస్‌ఆర్‌ సీపీపై నింద వేయవచ్చు అని ప్రతాప్‌రెడ్డిని సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు పంపించాడు. బలహీనవర్గాలకు పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాత్రమే. వైయస్‌ జగన్‌ అభినవ పూలే. వైయస్‌ జగన్‌ చేస్తున్న కార్యక్రమాలను ఏదో విధంగా దెబ్బతీయాలని, కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకోవాలని కుట్రపూరిత ధోరణితో వ్యవహరించాడు. 59.85 శాతం రిజర్వేషన్‌తో ముందుకు వెళ్తుంటే కోర్టులో కేసు వేయించి ఎన్నికలు జరగకుండా అడ్డుకొని.. మళ్లీ తాబేదారులతో ప్రెస్‌మీట్లు పెట్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు.

బలహీనవర్గాలను బ్యాక్‌బోన్‌గా, శక్తివంతులుగా తయారు చేస్తుంది సీఎం వైయస్‌ జగన్‌. బలహీనవర్గాలకు నేనున్నానని చెప్పి బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన పోరాడుతున్నాడు. పూలే చెప్పాడు.. అభినవ పూలే సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్నారు. 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చట్టంలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో అవకాశం కల్పించారు. 40 ఏళ్ల అనుభవంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం అవకాశం కల్పించాలనే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుకు వచ్చిందా..? రాష్ట్రంలో 220 మార్కెట్‌ యార్డు చైర్మన్‌లు ఉంటే 110 చైర్మన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించాడు. ఇవే కాకుండా 1620 పైచిలుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు డైరెక్టర్‌ పదవులు ఇచ్చారు. బీసీల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. బీసీల మనోభావాలను గుర్తించిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ జేజేలు పలుకుతున్నారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి, వైయస్‌ జగన్‌కు వ్యతిరేకంగా వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి బీసీలమని చెప్పుకునేవారంతా వారి సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తున్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎస్సీ మహిళలను హోంశాఖ మంత్రి చేసిన చరిత్ర సీఎం వైయస్‌ జగన్‌ది. ఎస్టీ, మైనార్టీలను మంత్రులను చేయగలిగాడా.. చంద్రబాబూ..? ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా..? బీసీలను తోకలు కత్తిరిస్తానంటాడు.. మత్స్యకారులను లాఠీలతో కొడతానంటావు.. ఇదేనా నీ అనుభవం. బలహీనవర్గాలు తలెత్తుకొని తిరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.

Back to Top