ఆంగ్ల మాధ్యమం ఓ చారిత్రక అవసరం

- హఫీజ్ ఖాన్
 

తెలుగు భాషకు న్యాయం జరుగుతుందంటే మన గౌరవ ముఖ్యమంత్రిగారి హయాంలోనే జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనుంచి మేము ఏమైనా నేర్చుకుందామని చూస్తే ఆయన జిలేబీలా వేసుకుంటూ పోతాడు తప్ప పాయింట్ మాత్రం మాట్లాడటం లేదు. జగన్ మోహన్ రెడ్డిగారు ప్రతి సంక్షేమ పథకంతో సిక్సర్ కొడుతుంటే వీళ్లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. ఆంధ్ర రాష్ట్రం పూర్తి భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ జగన్ మోహన్ రెడ్డిగారి హయాంలోనే అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ పాఠశాలలు. ప్రభుత్వ పాఠశాలలు పేదవాళ్ల స్కూళ్లుగా ముద్రపడ్డాయి. పేదల్లోనూ కాస్త స్తోమత ఉంటే ప్రభుత్వ బడులకు కాకుండా ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఇంతగా ఫెయిల్ అయ్యింది కనుకే దాన్ని సరిదిద్దాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలే సక్రమంగా ఉంటే ఇన్ని వేల ప్రైవేట్ స్కూళ్లు వచ్చే అవకాశమే ఉండేది కాదు.
నేడు వైయస్ జగన్ మోహనరెడ్డిగారు ప్రారంభించిన నాడు నేడు, ఆంగ్ల మాధ్యమంలో ప్రాధమిక విద్య నిర్ణయాల ద్వారా ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫునా ధన్యవాదాలు. సీఎం గారు తెలుగు, ఉర్దూ భాషలకు సముచిత స్థానం ఇస్తున్నారు. ప్రజలకు ఏది కావాలో ప్రభుత్వం అదే చేయాలి. మన ముఖ్యమంత్రి అదే చేస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఉర్దూ మీడియం విద్యార్థుల్లో హైయ్యస్ట్ డ్రాపౌట్స్ ఉంటున్నారు. చిన్నవయసు నుంచే ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల హైయ్యర్ ఎడ్యుకేషన్ కు వెళ్లేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. కాంపిటేటివ్ పరీక్షలకైనా, కార్పొరేట్ ఉద్యోగాలకైనా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలన్నా వారికి ఆంగ్ల మాధ్యమంలో బోధన అవసరం అని గుర్తించి సీఎం వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించినప్పుడు అందరూ విమర్శించారు. తర్వాత అది ఓ గొప్ప నిర్ణయంగా కొనియాడారు. అలాగే పరిస్థితులను బట్టి, మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని మార్పులు చేసుకోవాలి. లేదంటే అందరం వెనుకబడిపోతాం. నేడు ఆంగ్ల మీడియం ఓ చారిత్రక అవసరం. మదర్సా బోర్డు ఏర్పాటు చేసుకుంటే అమ్మ ఒడి పథకం వర్తింపచేస్తామన్నందుకు ముఖ్యమంత్రిగారికి ధన్యవాదాలు.

Read Also: సామాన్యుడి కొడుకు ఆంగ్లమాధ్యమం చదవకూడదా?

Back to Top