అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరగలేదని టీడీపీ చెప్పడం లేదని, ఎందుకు చర్చకు ముందుకు రావడం లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. స్పీకర్ చర్చిద్దామని చెబుతున్నా టీడీపీ వినడం లేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఇవాళ సభలో టీడీపీ సభ్యులు సభా కార్యాకలాపాలు జరుగకుండా అడ్డుపడ్డారు. చంద్రబాబును అరెస్టు చేయకూడదు. చంద్రబాబు నిప్పు అని టీడీపీ నేతలు అంటున్నారే తప్ప స్కిల్ స్కామ్ గురించి మాట్లాడటం లేదు. అప్పట్లో స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి ఇచ్చిన జీవోను ఎందుకు అమలు చేయలేదు. గుజరాత్ మోడల్‌ను ఎందుకు అమలు చేయలేదు. సీమెన్స్ కంపెనీ రూ.500 కోట్లు ఖర్చు చేస్తే అప్పుడు గుజరాత్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇక్కడ సీమెన్స్ కంపెనీ పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఖర్చు చేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరకలేదా? అందుకే కదా అమరావతికి పారిపోయి వచ్చాడు. ఫైబర్ నెట్ కేసులో కూడా అంతే అవినీతి జరిగింది. టీడీపీ నేతలు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు సభకు వచ్చారు. ఈ ఐదు రోజుల్లో చంద్రబాబు అవినీతిపై చర్చించి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొనానరు