నీ పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు చేశావా బాబూ?

రాయచోటిలో ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి 

బ్యాంక్‌ రుణాలు ఎగ్గొట్టిన వారికి టికెట్లు ఇచ్చావు

వారిని ఏకంగా రాజ్యసభ సభ్యులుగా చేశావు

కేంద్రంలో బీజేపీ రావడంతో మళ్లీ రాజకీయం

ఒకేసారి నలుగురు ఎంపీల కండువా మార్పించావు

అదీ మీ అనైతిక రాజకీయం. స్వార్థ రాజకీయం

చంద్రబాబును నిలదీసిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

ఏ ముఖం పెట్టుకుని రాయలసీమకు వచ్చావు

ఎక్కడ ఏం జరిగినా సీమ సంస్కృతి అన్న విమర్శ

నీవూ సీమలోనే పుట్టావన్న విషయం మర్చిపోయావు

అన్ని వర్గాల వారికి మేము మేలు చేస్తున్నాం

అయినా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే మీ పని

చంద్రబాబు ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి

మీరేం చెప్పినా ప్రజలు అస్సలు నమ్మబోరు

రాయచోటి:  నీ పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు చేశావా అంటూ రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి శ్రీ‌కాంత్‌రెడ్డి చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. ఈ దేశంలో బ్యాంకులు అన్నింటినీ వేల కోట్లకు ముంచేసి తనకు ఆ డబ్బులు తీసుకువచ్చి ఇచ్చిన వారికి ఒకప్పుడు చంద్రబాబు రాజ్యసభ సీట్లు ఇచ్చాడు. బ్యాంకుల్లో వేల కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టి దేశానికి ఎంతో నష్టం చేసిన వ్యక్తులను చంద్రబాబు రాజ్యసభ సభ్యులుగా చేసిన చరిత్ర మనం చూశాం. అలాగే వారు బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బులన్నీ కూడా చంద్రబాబు వద్దకు చేరాయి. అలాంటి వారిని రాజ్యసభకు పంపారు చంద్రబాబు. 

అర్ధం లేని విమర్శలు:
    అలాంటి ఆయన ఇవాళ మాపై విమర్శలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం వారికి రాజ్యసభ టికెట్లు ఇచ్చామని అంటున్నారు. ఇద్దరు బీసీలకు వరుసగా రెండోసారి రాజ్యసభ సీట్లు ఇస్తే.. పక్క రాష్ట్రం అంటూ నసుగుతున్నాడు. కృష్ణయ్య గారికి ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. కృష్ణయ్య గారు తెలంగాణకు చెందిన వారు అయినా, బీసీల సంక్షేమం కోసం దాదాపు 40 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా పోరాడుతున్న వ్యక్తి. బీసీలు గుర్తించిన వ్యక్తి. ఇది అందరికీ కూడా తెలుసు.
    తన పార్టీలో ఉంటేనేమో కృష్ణయ్య గొప్ప వాడు. అదే ఆయన వైయస్‌ఆర్‌సీపీలో ఉంటే ప్రక్క రాష్ట్రం వాడి కింద లెక్కలోకి వస్తాడు. ఇది ఏ మాత్రం విలువలేని చంద్రబాబు రాజకీయం.

ఎంపీలను బీజేపీకి తాకట్టు:
    బ్యాంకులను ముంచేసిన వారిని రాజ్యసభ సభ్యులుగా చేసిన చంద్రబాబు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడంతో, వారు ఎక్కడ వీపు పగలగొడతారో అని భయపడి, గంపగుత్తగా వారందరినీ బీజేపీలోకి పంపించిన వ్యక్తి చంద్రబాబు. ఆ విధంగా వారందరినీ బీజేపీకి తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు. దేశంలో ఈ రీజినల్‌ పార్టీ కూడా ఇలా ఒకేసారి గంపగుత్తగా నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించలేదు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. 

పక్క రాష్ట్రంలో బాబు అనైతిక రాజకీయం:
    ఇప్పుడు మా ఇద్దరు రాజ్యసభ సభ్యులను పక్క  రాష్ట్రం వారని మాట్లాడుతున్నాడు. మరి అదే పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్‌ రెడ్డితో డబ్బుల మూటలు మోయించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేçస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి, రాత్రికి రాత్రి కరకట్టకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అలాంటి చంద్రబాబు ఇవాళ పక్క రాష్ట్రం వారని మాట్లాడుతున్నారు.

మాది సామాజిక న్యాయం:
    ఇవాళ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన సామాజిక న్యాయం దేశవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఇవాళ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే వారిలో 5గురు బీసీలు.
    అయితే తను బీసీల పేరుతో పార్టీని నడిపి, దాన్ని నిలబెట్టుకుని, అనేక పదవులు, అధికారం అనుభవించి, వారికి ఏ మాత్రం మేలు చేయని వ్యక్తి చంద్రబాబు. అదే మా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని రాజకీయ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
    వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రబుత్వం ఎన్ని మంచి పనులు చేసినా, ఎంతసేపూ తనకున్న ఎల్లో మీడియా సహకారంతో ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు చేసే వ్యక్తి చంద్రబాబు.

సీమపై ఎందుకంత ద్వేషం?:
    నిన్నటి వరకు బాబు, ఎల్లో మీడియా ఏం మాట్లాడారు. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్‌ అంటూ అక్కడ ప్రజల్ని చులకన చేసారు. ఈ వ్యక్తి చిత్తూరు జిల్లాలో పుట్టిన వ్యక్తి. రాయలసీమ వాసి అని మర్చిపోయాడు. పైగా వారినే కించ పర్చే విధంగా ఎక్కడో రైలు కాలిపోతే, కడప వారు, పులివెందలు వాళ్లది ఈ కల్చర్‌ అని మాట్లాడే ఈ తండ్రీ కొడుకులకు సిగ్గు లేదా? ఇవాళ రాయలసీమకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? మీకు రాయలసీమ అంటే ఎందుకంత ద్వేషం? ఎందుకు రాయలసీమను అంత అవమానించే విధంగా మాట్లాడతారు.

మీకా అర్హత లేదు:
    ఎన్నిసార్లు మనం చూశాం. ఎక్కడ ఏం జరిగినా, కడప కల్చర్, పులివెందుల కల్చర్, రాయలసీమ కల్చర్‌ అని దిగజారి మాట్లాడే నువ్వు, ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చే అర్హత కూడా లేదని చెబుతున్నాం. 
    అదే విధంగా పులివెందుల బస్టాండ్‌ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా? అని ఈ పెద్దమనిషి మాట్లాడాడు. ఇవాళ పులివెందులలో అతి పెద్ద బస్టాండ్‌ త్వరలోనే పూర్తైపోతుంది.
మళ్లీ సిగ్గు లేకుండా తాను కట్టిన బిల్డింగ్‌లకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ రంగులు వేçస్తున్నారని అంటున్నాడు. అసలు ఏం కట్టావు నీవు? కనకదుర్గ ఫైఓ్లవర్‌ పనులు మొదలు పెట్టి, దాన్ని కూడా పూర్తి చేయలేకపోయావు. 

వాటిని అడ్డుకుంది నీవు కాదా?:
    అమరావతిని పూర్తిగా గ్రాఫిక్స్‌లో చూపించి మభ్య పెట్టావు. చివరకు కనకదుర్గ ఫైఓ్లవర్‌ను కూడా జగన్‌గారు పూర్తి చేశారు. నిజానికి నీవు ఏ చిన్న పని చేయకపోగా, ప్రజలను భ్రమపెట్టావు. వారిని మోసం చేశావు.
మేము పులివెందుల బస్టాండ్‌ కట్టలేదు. మూడు రాజధానులు ఎలా కడతారని అంటున్నావు. మరి మూడు రాజధానులు కట్టడానికి ఎవరు ఆటంకం సృష్టిచారు. నువ్వు కాదా. కర్నూలులో న్యాయ రాజధాని, హైకోర్టు ఉండకూడదని కోర్టులకు వెళ్లింది నువ్వు కాదా? విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కట్టకుండా అడ్డుకుంది నువ్వు కాదా?.

స్వాగతించే ధైర్యం ఉందా?:
    మరి మేము మూడు రాజధానులు కడతాము. వాటికి నువ్వు అంగీకారం తెలుపుతావా. స్టేలు వెకేట్‌ చేయించుకుని మూడు రాజధానులు కడతాం. నీవు స్వాగతిస్తావా? ఆ ధైర్యం ఉందా?
ఎంతసేపూ రాజకీయాల కోసం నీచ సంస్కృతి. నీ వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఎపుడూ దిగజారి పోతా ఉంటావు. 

ఇంద్ర భవనం మాత్రమే కట్టుకున్నావు:
    ఆయన కట్టిన బిల్డింగ్‌లకు మా ప్రభుత్వం రంగులు వేస్తోందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి ఆయన తన హయాంలో 5 ఏళ్లలో ఏం కట్టాడంటే హైదరాబాద్‌లో 250 కోట్లతో తన సొంత భవనం మాత్రమే కట్టుకున్నాడు. సొంత రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్‌లో 250 కోట్లతో ఇంద్రభవనం నిర్మించుకున్నాడు. అమరావతి రాజధాని అని చెప్పినా ఇక్కడ మాత్రం ఇల్లు కట్టుకోలేదు. చంద్రబాబు తన సొంత భవనం తప్ప, ఆ 5 ఏళ్లలో మరేదీ కట్టలేదు. అయినా ఆయన కట్టిన బ్లిడింగ్‌లకు రంగులు వేయాల్సిన అవసరం మాకేముంది. నీవు ఏమీ చేయలేదు. అందుకే ఇలా దిగజారి మాట్లాడతున్నావు.

అందుకు సిగ్గు పడాలి:
    దేశ వ్యాప్తంగా డీజిల్‌ ధరలు, పెట్రోల్‌ ధరలు, గ్యాస్‌ ధరలు, ఎరువుల ధరలు, ద్రవ్యోల్భణం పెరగటానికి కారణం ఎవరు? కేంద్రంలో ఉన్న బీజేపీ విధానాల వల్ల ఇవన్నీ పెరిగితే.. రాష్ట్ర ప్రభుత్వం మీద ఏడుపు ఏమిటి? బీజేపీని ఏమీ అనలేక, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తున్నారు. బీజేపీపై ఎందుకు మాట్లాడలేక పోతున్నావంటే వారు నీ  వీపు పగలగొడతారని భయం. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉన్నందుకు మనం సిగ్గుపడాలి.

రాక్షసానందం:
    ఇవాళ ఎక్కడికి పోయినా, నిలదీస్తున్నారని అంటున్నాడు. రాష్ట్రంలో జగన్‌గారు చేస్తున్న మంచి పనుల వల్ల 90 శాతం మంది ఆయన వెంటే ఉన్నారు. మిగిలిన ఆ 10 మందిలో ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే దాన్ని ఏదోలా చూపించి రాక్షసానందం పొందుతున్నారు. నీ రాక్షసానందం ఎక్కువ రోజులు ఉండదు. ఆ విషయం స్పష్టమవుతోంది. మేము గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రజలు చూపుతున్న ఆదరణ చూస్తే, నీ గుండె పగులుతుంది.

అప్పు చేసి ఏం చేశావు?:
    జగన్‌గారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆయన అప్పులు చేసి పంచుతున్నారని ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. మరి నీ హయాంలో ఆ 5 ఏళ్లలో ఏకంగా నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి, కాంట్రాక్టర్లకు 80 వేల కోట్ల బిల్లులు పెండింగులో పెట్టి పోయావు, అంత అప్పు చేసి ప్రజలకు ఏం చేశావు?
    కానీ జగన్‌ గారు చేసిన అప్పులతో పూర్తి ఫిగర్స్‌తో వివరించగలం. దాదాపు లక్షా యాభై వేల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేశాం. అలా నీవు ఏమైనా చూపించగలుగుతావా. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తే, ఒక్కోటి సరి దిద్దుతూ, ప్రజలకు మేలు చేస్తుంటే, వారి ఎదుగుదలతకు తోడ్పడుతుంటే చూసి ఓర్చుకోలేక పోతున్నాడు.

అక్కడా మాపైనే నింద:
    ఒంగోలులో ఈయన పెట్టుకున్న మహానాడుకు ఎవరో అడ్డుపడ్డారంటాడు. ఎవడు అడ్డుపడతారు. జనం రారని భయంతో చంద్రబాబే ప్లేస్‌ మార్చుకున్నాడు. అయినా స్టేడియహ ఇవ్వడం లేదని విమరిస్తున్నాడు. స్టేడియం ఇవ్వాలా, వద్దా అన్నది నిర్వాహకుల ఇష్టం. అంత కంటే పెద్ద పెద్ద గ్రౌండ్‌లు చాలానే ఉన్నాయి. అవన్నీ వదిలేసి.. ఇరుకు షెడ్లలో కూర్చుంటేనే.. నిండా కనిపిస్తుందన్న చీప్‌ స్ట్రాటజీ చంద్రబాబుది. దీన్ని ప్రభుత్వం మీద తోయటం ఏంటి. 

అక్కడే సెటిల్‌ అవ్వు:
    పొద్దున లేస్తే చాలు.. శ్రీలంక.. శ్రీలంక అంటూ.. చంద్రబాబు తెగ కలవరిస్తుంటాడు. బహుశా.. రావణాసురుడి సంతతిగా ఆ జన్మలో పుట్టి, ఈ జన్మలో ఏపీలో పుట్టినట్టున్నాడు. అంతగా శ్రీలంకపై మమకారం ఉంటే.. ఆ దేశానికి వెళ్లి అక్కడే సెటిలైతే మంచిది. అంతేతప్ప ప్రజలకు ఇస్తున్న డబ్బును హేళనగా మాట్లాడొద్దు.

అవన్నీ ఇవ్వొద్దంటారా?:
    జగన్‌గారు ఏ డబ్బు ఊర్కే ఇస్తున్నాడో చెప్పండి. ఆరోగ్య ఆసరా ఇవ్వడం తప్పా. అమ్మ ఒడి ఇవ్వడం సరి కాదా. విద్యా దీవెన, వసతి దీవెన సమయానికి ఇవ్వడం జగన్‌గారుచేస్తున్న తప్పా. మహిళలను చేయూత పథకం ద్వారా ఆదుకోవడం తప్పా? మీరు డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పారు. మేము వారిని ఆదుకుంటే తప్పా?
ప్రతి నెల 1న పెన్షన్‌ ఇవ్వడం తప్పా? ప్రజలకు ఇంకా ఏమైనా చేయాలంటే చెప్పండి.

అదీ మీ సంస్కారం:
    ఓడిపోతే ప్రజల మైబడ్‌సెట్‌ బాగా లేదనే సంస్కృతి నీది. నీవు ఓడిపోతే ఈవీఎంలు కారణమన్న సంస్కారం నీది. ఇన్నేళ్ల నీ పరిపాలనలో ఏ ఒక్క సామాజిక వర్గానికి అయినా మేలు చేశావా. ముస్లింల మీద దేశద్రోహం కేసుల పెట్టావు,. మత్స్యకారులను అవమానించావు. చివరకు నీ రాయలసీమ వాసులనూ అవమానించావు. 
    కానీ మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఇప్పటికే 95 శాతం అÐమలు చేశాం. అదే నీవు చివరకు నీ మేనిఫోస్టోను కనపడకుండా చేశావు. అందుకే నీవు ఏం చెప్పినా, మాట్లాడినా ప్రజలు నమ్మబోరని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top