చంద్రబాబుది ప్రజల ఆత్మాభిమానం దెబ్బ తీసే ఉద్యమం

చంద్రబాబుది ఉత్తరాంధ్ర, రాయలసీమ వ్యతిరేక ఉద్యమం

చంద్రబాబువి కుల రాజకీయాలు

తాత్కాలిక అసెంబ్లీ పేరుతో వేల కోట్ల దోపిడీ

అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: అమరావతి పేరుతో చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమ వ్యతిరేక ఉద్యమం చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కర్నూలు, విశాఖ అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత ఉద్యమిస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానం దెబ్బతీసే ఉద్యమమని అభివర్ణించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎప్పుడూ కరువు, కాటకాలతో ఉండాలా అని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదనేది చంద్రబాబు ఉద్దేశమా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు.  రైతుల కోసం పని చేసే ప్రభుత్వం తమదనిస్పష్టం చేశారు. ప్రజలను డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో సొంత మనుషులే ఆయనకు గుర్తుంటారన్నారు.  చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.తాత్కాలిక అసెంబ్లీ పేరుతో చంద్రబాబు దోచుకున్నారని ధ్వజమెత్తారు. తాత్కాలిక భవనాలు కట్టి రూ. వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి చంద్రబాబు, లోకేష్‌ టూరిస్టులుగా మారారని ఎద్దేవా చేశారు. కరోనాకు భయపడి హైదరాబాద్‌లో దాక్కున్నారని పేర్కొన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పారు. చంద్రబాబు చేసేవన్నీ దుర్మార్గపు ఆలోచనలే అన్నారు. 
 

Back to Top