ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం.. 

ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి

అమ‌రావ‌తి:  మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు అంటే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి గౌర‌వం ఉంద‌ని పార్టీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. సభలో హెల్త్ వర్శిటీపై టీడీపీ స‌భ్యులు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం ప‌ట్ల ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్టీరామారావుగారిపై మాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత డా.వైయ‌స్ రాజశేఖర్ రెడ్డికి వుంది. అందుకే ఆయన పేరు పెడుతున్నాం. ఒక జిల్లా పేరుకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాం. రాజకీయంగా ఏమీ లేక టీడీపీ స‌భ్యులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయదురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top