సీఎం వైయ‌స్‌ జగన్‌ది ఉక్కు సంకల్పం

రాజన్న తరువాత క్రెడిబులిటీ ఉన్న నాయకుడు వైయ‌స్‌ జగనే

రాయచోటి జలయజ్ఞం కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి

వైఎస్సార్‌ జిల్లా: చంద్రబాబు నాయుడి రాక్షస పాలనలో ప్రజలందరి జీవితాలు నాశనమయ్యాయని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో జరిగిన జలయజ్ఞం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో నియోజకవర్గం మొత్తం కరవుతో అల్లాడిపోయిందని వాపోయారు. ఆ పది సంవత్సరాలు ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారని చెప్పారు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పై అభిమానంతో నా వెంటే నడిచిందుకు నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 
వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి తరువాత..
రాష్ట్రంలో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి తరువాత జగనేనని శ్రీకాంత్‌ రెడ్డి కొనియాడారు. రాయచోటి అన్ని మండలాలకు నీళ్లు ఇచ్చేందుకు దండిగా నిధులు విడుదల చేస్తున్నారని ఆయన చెప్పారు. ఝరికోన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా రాయచోటి ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. సంబేపల్లి మండలంలో 5000 ఎకరాలు స్థిరీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. హంద్రీనీవా ద్వారా గాలివీడు మండలంలో ఒక ప్రాంతానికే  నీరందుతోందని ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 
అడక్కుండానే అన్నీ..
100 పడకల ఆసుపత్రికోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీక్షలు, ధర్నాలు చేసినా పట్టించుకోలేదని శ్రీకాంత్‌ రెడ్డి గుర్తు చేశారు. వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత కనీసం మాటమాత్రమైనా అడగకుండానేఅన్నీ చేస్తున్నారని చెప్పారు. రాయచోటి టౌన్‌ బ్యూటిఫికేషన్‌ కోసం రూ.360 విడుదల చేశారని తెలిపారు. ఇంకా ఎన్నో పనులకు నిధులు విడుదలచేశారని చెప్పారు. నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయించి మహిళాభ్యున్నతికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. 
ప్రాణం ఉన్నంత వరకు..
వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలో పని చేసేందుకు గర్విస్తున్నానని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఆయన అడుగులో అడుగు వేస్తూజీవితాంతం ఆయన వెన్నంటే ఉంటానన్నారు. రాయచోటి నియోజకవర్గం అభివద్ధికి అన్నివిధాల సహకారం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.  

తాజా ఫోటోలు

Back to Top