జగనన్న చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిద్దాం 

వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్య‌క్ర‌మ‌లో ఎమ్మెల్యే డాక్ట‌ర్ సిద్ధారెడ్డి

అనంత‌పురం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిద్దామ‌ని క‌దిరి ఎమ్మెల్యే డాక్ట‌ర్ సిద్ధారెడ్డి అన్నారు. కదిరి రూరల్ మండలం, ఎగువపల్లి గ్రామ సచివాలయం పరిధిలోఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం లో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి  పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్  అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలను మనం ప్రతి వ్యక్తికి  వివరిద్దామన్నారు. ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి డి.బి.టి ద్వారా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతున్న విషయాన్ని,  లంచగొండితనానికి, అధికార దుర్వినియోగానికి తాగు లేకుండా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు.  మరి ఈనాడు నిజంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అంటే అది కేవలం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమన్నారు. కాబట్టి జగనన్న మళ్లీ మనం గెలిపించుకోవాలని వారు ముఖ్యమంత్రిగా కొనసాగితే సంక్షేమం, అభివృద్ధి రెండు సమానంగా రాష్ట్రంలో అమలవుతాయన్నారు.  జగనన్న చేపట్టిన వై నీడ్స్ ఏపీ జగన్ కార్యక్రమం విజయవంత అయ్యేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.  

తాజా వీడియోలు

Back to Top