పరిసరాల శుభ్రత అందరి బాధ్యత

ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు
 

శ్రీ‌కాకుళం:  పరిసరాల శుభ్రతను అందరూ బాధ్యతగా స్వీకరించాలని  వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్ ఆవరణలో ఎమ్మెల్యే ధర్మన ప్రసాదరావు చెత్త బుట్ట‌ల పంపిణీ చేప‌ట్టారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ప్రజలు చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను కాలువలో వేయడం వలన కలుషిత వాతావరణం ఏర్పడుతున్నదన్నారు.  ఇది ఒక పెద్ద సమస్య , అందరూ ఈ చెత్త వల్ల అపరిశుభ్ర వాతావరణం వల్ల ఇబ్బంది పడుతున్నార‌ని తెలిపారు. పెరుగుతున్న నగరీకరణ వల్ల మన పట్టణాలు మురికి కూపాలు గా మారిపోతున్నాయి. ఉన్న గార్బేజ్ నిండిపోయాయి.. మరి చెత్తను ఎక్కడ వేస్తారు. తడి చెత్త, పొడి చెత్త, ఇతరత్రాలుగా చెత్తసేకరణ జరుగుతోంద‌న్నారు.సుదూర ప్రాంతాలకు తరలించి..ప్రజలకు మేలు చేయాలని ఈ ప్రక్రియ చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు.  ధనవంతులు, పేదలు అనే తరతమ్యత లేదు. మన పట్టణ క్లీన్ గా ఉంచడానికి చాలా మంది పని చేస్తున్నారు. గతంలో ఒక గార్బేజి కూడా ఉండేది కాదు.. తాను నాటి రెవెన్యూ మంత్రిగా పని చేసిన కాలంలో ప్రత్యేక యార్డును ఏర్పాటు చేయించాన‌ని గుర్తు చేశారు. దానిని ఇరవై ఏళ్ళ నుంచి వినియోగిస్తున్నామ‌న్నారు.  నేడు అది కూడా నిండిపోయింది. అందుకే నూతన విధానాలు ద్వారా ఈ సమస్య పరిష్కరించాలని ఆలోచిస్తున్నామ‌న్నారు. కొందరు దీని పట్ల అవగాహాన లేకుండా రాద్ధాంతం చేస్తున్నార‌ని త‌ప్పు ప‌ట్టారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top