ప్రజలకు మేలు చేయని బాబు రాజకీయ జీవితం దేనికి?

ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
 

అసెంబ్లీ: 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని, ప్రజలకు మేలు చేయని ఆయన రాజకీయ జీవితం దేనికని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు?. చంద్రబాబు ఏం మాట్లాడినా ఆయన అవసరాలకే మాట్లాడుతున్నారు. మేధావులు ఉన్న శాసన సభ ఉండగా .. మండలి ఎందుకని ఎన్టీఆర్‌ నాడు రద్దు చేశారు. ప్రజలకు మేలు చేయని ఈ మండలి మనిషికి ఉన్న ఆరో వేలు వంటిది. బండికి ఐదో చక్రం లాంటిది. అలాంటి మండలిని ఎందుకు కొనసాగించాలి. ప్రజలు ఓడించిన వ్యక్తులు , ఆర్థిక నేరస్తులు టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు.  ప్రజల చేత తిరస్కరించబడిన వారే మండలిలో ఉన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినవాళ్లు రాజకీయంగా రాణించలేదు. మండలికి అయ్యే ఖర్చును ప్రజల కోసం వినియోగించాలి. శాసన సభ బిల్లులను అడ్డుకోవడానికి మండలి యత్నిస్తోంది. సభలో చేసిన చట్టాలను మండలి అడ్డుకుంటోంది. 

Back to Top