రీపోలింగ్‌ అంటే బాబుకు ఎందుకంత భయం

ఓటు వేస్తే దళితులను టీడీపీ నేతలు చంపేస్తామంటున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

చంద్రగిరి: రీపోలింగ్‌ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రగిరి పరిధిలోని ఐదు ప్రాంతాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశిస్తే దాన్ని తప్పుబడుతున్నాడన్నారు. దళితులు ఓట్లు వేయడానికి వస్తే చంపేస్తామంటూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాడని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును చంద్రబాబు సామాజికవర్గం నొక్కేస్తుంటే దళితులను ఓటు వేయకుండా అణచివేస్తుంటే దాన్ని నువ్వు సమర్థిస్తావా చంద్రబాబూ అని ప్రశ్నించారు. రీపోలింగ్‌ జరుగుతున్న ఐదు ప్రాంతాల్లో రిగ్గింగ్‌ జరగలేదని చంద్రబాబు గుండె మీద చేయివేసుకొని చెప్పగలడా అని నిలదీశారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. 19వ తేదీన జరుగుతున్న రీపోలింగ్‌కు వచ్చి ఓటు వేస్తే చంపేస్తామంటూ దళితులను తెలుగుదేశం పార్టీ నేతలు భయపెడుతున్నారన్నారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకొని దళితులు అంతా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. 

 

Back to Top