పార్టీలకు అతీతంగా వాలంటీర్ల సేవ‌లు

ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు

ప‌ల్నాడు: పార్టీలకు అతీతంగా వాలంటీర్లు సేవలందిస్తున్నార‌ని ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని జాషువా కళాప్రాంగణంలో వినుకొండ రూరల్ మండలం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు   ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత సేవా భావంతో, పార్టీ లకు అతీతంగా ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరవేయటం లో వాలంటీర్ లది ముఖ్య పాత్ర అని తెలిపారు. ఈ వాలంటీర్ల్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. 

కరోనా క‌ష్ట‌కాలం లో వీరు చేసిన సేవలు వర్ణనాతీతం అని బ్ర‌హ్మ‌నాయుడు అన్నారు. ఇలాగే ప్రతి కుటుంబం తో మమేకమై వారి పరిధి లోని 50 ఇళ్ళ ను వారి బాగోగులు చూస్తూ, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధి లాగా పనిచేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ ఎంత గానో ఉపయోగకరమని తెలిపారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన నవరత్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి  ఉద్దేశమని, అందుకనే పుట్టే బిడ్డ దగ్గర నుండి పండు ముసలి వారి వరకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలిపారు. వీటితో పాటు గ్రామ స్వరాజ్యంగా గ్రామం లోనే సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్ఆర్  హెల్త్ సెంటర్ లను నిర్మించి ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో నిర్మూలన చేసే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇంత సంక్షేమం అందించటం తో పాటు అభివృద్ధి చెందుతున్న రాష్ట్ర లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి అని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ అంటేనే దోపిడీ..
నీరు చెట్టు కార్యక్రమం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేశామని టీడీపీ నేత‌లు  దోపిడీ చేశార‌ని బ్ర‌హ్మ‌నాయుడు విమ‌ర్శించారు. ఇంకుడు గుంతల పేరుతో గుంతలు త్రోవ్వి డబ్బులు దోచుకున్న‌ దొంగలు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కాదా అని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల పేరు తో ప్రజా ధనాన్ని దోచుకున్న వారు తెలుగుదేశం పార్టీ వారు అని తెలిపారు.

చంద్ర‌బాబే గారడీ..
ప్రజల వద్దకు కొత్త గా గారడీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తున్నార‌ని ఎమ్మెల్యే హెచ్చ‌రించారు. మీరు చేసే గారడీ లను నమ్మే వారు ఎవరు లేరని, ప్రజలకు మీరు చేసిన అన్యాయానికి మీరు చేసిన అరాచకానికి తోందరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు. 

అబద్ధాల ఆంజనేయులు..
వినుకొండ కు చేసిన అభివృద్ధి ఏంటి అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని ఆంజనేయులు, ప్రజలకు అబద్దపు మాటలు చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నాడు. వినుకొండలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం ద్వారా మేము అభివృద్ధి చేస్తుంటే ప్రజల వద్ద కు వెళ్లి అబద్దపు ప్రచారానికి తెరలేపుతున్నాడు ఆంజనేయులు. స్టేడియం నిర్మాణానికి అడ్డంకులు వేసి మరలా అభివృద్ధి ఆగిందని ప్రెస్ మీట్ లో మాట్లాడటం నీ నీచ బుద్ధికి నిదర్శనం ఆంజనేయులు. నీ మాటలు అన్ని బురీడి మాటలని ప్రజలు అర్ధం చేసుకున్నారు ఆంజనేయులు నీకు తొందరలోనే గుణ పాఠం చెబుతారని ఎమ్మెల్యే బ్ర‌హ‌మ్మ‌నాయుడు హెచ్చరించారు.

Back to Top