కంట‌త‌డి పెట్టిన ఎమ్మెల్యే భూమ‌న‌

శానిటైజర్‌ తాగి నలుగురు చనిపోవడం బాధాకరం 
 

తిరుపతి : తిరుపతి స్కేవెంజర్స్ కాలనీలో శుక్రవారం శానిటైజర్ తాగి నలుగురు చనిపోవ‌డంతో ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి దిగ్భ్రాంతికి గుర‌య్యారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మార్చురీని సందర్శించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి క‌న్నీరు పెట్టారు. శానిటైజర్‌ తాగి నలుగురు చనిపోవడం చాలా బాధాకరమని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  శానిటైజర్‌ మద్యం కాదని.. కేవలం చేతులుశుభ్ర పరుచుకోవడానికి వినియోగించే మందని.. దీనిపై అధికారులు, ప్రభుత్వము పదేపదే హెచ్చరిస్తున్నా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మద్యానికి బానిసైన  యువకులు పొరపాటున శానిటైజర్‌ తాగి ప్రాణాలు కోల్పోయారు. చేతులు శుభ్రపరుచుకుని శానిటైజర్‌ను మత్తుకు వాడకూడదని చేంతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ ఎమ్మెల్యే భూమ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top