సంక్షేమ పాలన సజావుగా సాగేందుకు మరోసారి వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆశీర్వదించాలి

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌

నంద్యాల‌:  కోట్లాది మందికి చేరువైన సంక్షేమ పాలన సజావుగా సాగేందుకు వచ్చే ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగూరు ఆర్థ‌ర్ కోరారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వెల్లడించారు.  పగిడ్యాల మండలంలో ఎమ్మెల్యే ఆర్థ‌ర్ గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ఆరా తీశారు. వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకొని అక్క‌డిక్క‌డే ప‌రిష్క‌రించారు.  ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..వలంటీర్లు, ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్‌ సీపీ శ్రేణులు, అధికారులు, అన్నివర్గాల ప్రజల సహకారంతో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని అన్నారు.  రాష్ట్రంలో అవినీతిలేని అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. గత నాలుగేళ్లలో అన్ని వర్గాల ప్రజలకోసం సీఎం వై.య‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించేందుకు జగనన్నే మా భవిష్యత్‌, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నాడు–నేడు పనులతో ప్రభుత్వ విద్యాలయాలు, ఆస్పత్రులు అందంగా ముస్తాబయ్యాయన్నారు. పేద విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, జగనన్న విద్యాకానుకలు, అమ్మఒడి వంటి పథకాలతో పాటు విదేశీ విద్యను కూడా చేరువ చేశారన్నారు.  రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీచేసిన ఘనత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, ఒక్క ఉద్యోగం తీయకపోగా, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు.  సంక్షేమ, అభివృద్ధి పాలన సాగించడంతో ప్రతీ ఒక్కరూ జగనన్నే మా భవిష్యత్‌ అంటున్నారని, ఆయననే మళ్లీ సీఎం చేస్తామని గట్టిగా చెబుతున్నారన్నారు.

Back to Top