ప్రకాశం జిల్లా..: రెండోసారి తప్పకుండా వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని మార్కాపురం ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆకాంక్షించారు. కొనకనమిట్ల బహిరంగ సభలో మార్కాపురం ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రసంగించారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఏమన్నారంటే.. నేటి మేమంతా సిద్ధం సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం. జరగబోవు ఎన్నికల్లో మనందరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించేందుకు మన ఆదేశాలు ఇవ్వడానికి విచ్చేసిన మన నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి, ధీశాలి, దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, సోదరీమణులారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేయాలి, ఆయన్ను ఆశీర్వదించాలి, ఆదరించాలి అలాగే ప్రతిపక్షాలకు ఎందుకు వేయకూడదు అనేది మనందరం కూడా గమనించాలి. చెప్పిన మాటకు కట్టుబడి నిలబడినటువంటి నాయకుడు, మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఎప్పుడూ ప్రజలకు అండగా నిలబడి ఎల్లవేళలా సహకారం అందించాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ప్రాంతం బాగుండాలని చెప్పి అహర్నిశలు ఆలోచన చేసే నాయకుడు మన నాయకుడు. 2019లో తన పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను గమనించారు. ఆ కష్టాలను అన్నింటినీ కూడా 2019 ఎన్నికల్లో తనకు అధికారం ఇచ్చినట్లైతే ఈ నవరత్నాలు అనేటువంటి ఈ 2 పేజీల ద్వారా ప్రజలందరి ఆకాంక్షలను నెరవేరుస్తానని చెప్పడమే కాకుండా గత 4 సంవత్సరాల 10 మాసాల్లో మొదటిరోజు నుండి ఈరోజు వరకు కూడా చెప్పిందీ, చెప్పందీ కూడా ఎన్నో ప్రజల యొక్క సంక్షేమం కోసం చేసినటువంటి ఘనత, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి మన నాయకుడు. 2024 మే 13న జరగబోతున్నటు వంటి ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మేలు చేకూరితేనే ఓటు వేయండని చెప్పిన ముఖ్యమంత్రి మన నాయకుడు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి శక్తి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గార్కి వచ్చింది. కారణం.. చెప్పినమాటకు నిలబడినటువంటి గొప్ప నాయకుడు మన నాయకుడు. కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, పేద ప్రజలకు అండగా ఉండేందుకోసం మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని వేడుకుంటున్నాను. మార్కాపురం నియోజకవర్గంలో వెలగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది, అది ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి గత నెలలోనే జాతికి, మన ప్రజలకు అంకితం చేసిన గొప్ప నాయకుడు మన నాయకుడు. అదేకాకుండా మార్కాపురంలో మెడికల్ కాలేజీ ఇచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు. అందుకే మనమందరం కూడా రెండోసారి తప్పకుండా వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తున్నాను.