సామాన్యుడికే పట్టం కట్టారు

నెల్లూరు ప్రజల రుణం తీర్చుకోలేనిది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌

 

నెల్లూరు: వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా సామాన్యుడికి పట్టం కట్టారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్‌కుమార్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మకం, విశ్వాసంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్క్రికీ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులో తన ఎన్నిక జీవన్మరణ సమస్య అని ప్రచార సమయంలో చెప్పానని, సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకొని గెలుపునకు కష్టపడండి అనే పిలుపు మేరకు ప్రజలంతా తనను అక్కున చేర్చుకొని గెలిపించారన్నారు.

ఏం చేసినా నెల్లూరు నగర ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. వందల కోట్లు కుమ్మరించినా సామాన్యుడికి పట్టం కట్టారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కలలు జెండా మోసిన ప్రతి కార్యకర్తలు కలలు కన్నారని, తొమ్మిది సం వత్సరాలు వైయస్‌ జగన్‌ పడిన శ్రమ ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఆ కష్టాలను తొలగించిందన్నారు.

తాజా ఫోటోలు

Back to Top