యువత క్రీడల్లోనూ రాణించాలి

 ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అందుకు వారి తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని నీలం సంజీవ్ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన క్రిస్టియన్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ...క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే గాక వ్యక్తిత్వాన్ని పెంపోందిస్తాయని చెప్పారు.ప్రభుత్వ పెద్దలతో చర్చించి క్రీడాకారుల అభిరుద్దికి తోడ్పాటును అందిస్తాం అని స్పష్టం చేశారు.అనంతపురం నగరంలో ఇప్పటికే చాలా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని ఇందుకు ప్రజలు సహకరించేలా అందరిలో చైతన్యం తీసుకురావడానికి యువత తోడ్పడాలని కోరారు.అనంతపురం సుందరికరణలో భాగంగా నగరంలోని పార్కుల్లో యువత శ్రమదానం చేసి స్వచ్ఛత పై అవగాహన తీసుకురావాలని కోరారు.గత రెండు సంవత్సరాలు గా ఈ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్న  మేనేజ్మెంట్ ను అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కమల్ భూషణ్,వైయ‌స్ఆర్‌ సిపి నాయకులు సునీల్,మదన్మోహన్ రెడ్డి, కోచ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top