పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు

ఎన్నికల కమిషనర్‌కు ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్న

తాడేపల్లి: ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పేరుతో లేఖ విడుదలైనా అతను ఎందుకు స్పందించడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాడేపల్లిలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా లేఖతో కుట్ర పన్నారని మండిపడ్డారు. లేఖపై ఇప్పటి వరకు రమేష్‌కుమార్‌ అధికారికంగా స్పందించలేదన్నారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ లేఖ రాయకుంటే బాధ్యత గల అధికారిగా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ మౌనం దేనికి సంకేతమని నిలదీశారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top